IND vs WI: వెస్టిండీస్‌తో తొలి వన్డే.. టీమిండియాదే బ్యాటింగ్‌! శాంసన్, హుడాలకు చోటు

ఇంగ్లండ్‌ పర్యటనలో టీ20, వన్డే సిరీస్‌ను గెలిచి మంచి ఊపులో ఉన్న భారత్.. ఇక వెస్టిండీస్‌తో అమితుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ట్రినిడాడ్‌ వేదికగా మరికొద్దిసేపట్లో తొలి వన్డే జరగనుంది. ఈ మ్యాచులో టాస్‌ నెగ్గిన విండీస్‌ కెప్టెన్ నికోలస్‌ పూరన్‌ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. దాంతో ముందుగా భారత్‌ బ్యాటింగ్‌కు దిగనుంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మకు బీసీసీఐ విశ్రాంతిని ఇవ్వడంతో వన్డే సిరీస్‌లో భారత జట్టుకు స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ సారధ్యం వహిస్తున్నాడు. 

Written by - P Sampath Kumar | Last Updated : Jul 22, 2022, 07:39 PM IST
  • వెస్టిండీస్‌తో తొలి వన్డే
  • టీమిండియాదే బ్యాటింగ్‌
  • శాంసన్, హుడాలకు చోటు
IND vs WI: వెస్టిండీస్‌తో తొలి వన్డే.. టీమిండియాదే బ్యాటింగ్‌! శాంసన్, హుడాలకు చోటు

India vs West Indies 1st ODI Playing 11 out: ఇంగ్లండ్‌ పర్యటనలో టీ20, వన్డే సిరీస్‌ను గెలిచి మంచి ఊపులో ఉన్న భారత్.. ఇక వెస్టిండీస్‌తో అమితుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ట్రినిడాడ్‌ వేదికగా మరికొద్దిసేపట్లో తొలి వన్డే జరగనుంది. ఈ మ్యాచులో టాస్‌ నెగ్గిన విండీస్‌ కెప్టెన్ నికోలస్‌ పూరన్‌ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. దాంతో ముందుగా భారత్‌ బ్యాటింగ్‌కు దిగనుంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మకు బీసీసీఐ విశ్రాంతిని ఇవ్వడంతో వన్డే సిరీస్‌లో భారత జట్టుకు స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ సారధ్యం వహిస్తున్నాడు. 

మూడు వన్డేల సిరీస్‌లో సీనియర్ ప్లేయర్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్‌ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్‌లకు బీసీసీఐ విశ్రాంతి కల్పించిన విషయం తెలిసిందే. శిఖర్ ధావన్ కెప్టెన్సీలో యువ ప్లేయర్లు ఈ సిరీస్‌లో ఎలా రాణిస్తారో చూడాలి. సీనియర్ల విశ్రాంతితో శుభ్‌మన్ గిల్, సంజూ శాంసన్, దీపక్ హుడా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్లకు జట్టులో చోటు దక్కింది. 

మోకాలి గాయం కారణంగా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తొలి రెండు వన్డేలకు దూరం అవుతున్నాడని బీసీసీఐ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు విండీస్ స్టార్ ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్‌కు కరోనా సోకడంతో ఈ మ్యాచ్ ఆడటం లేదు. ఈ విషయాన్నీ కెప్టెన్ నికోలస్ పూరన్ తెలిపాడు. విండీస్‌తో భారత్‌ మూడు వన్డేలను ఆడనుంది. 

తుది జట్లు:
భారత్: శిఖర్ ధావన్‌ (కెప్టెన్‌), శుభ్‌మన్ గిల్, శ్రేయస్‌ అయ్యర్, సూర్యకుమార్‌ యాదవ్, సంజూ శాంసన్, దీపక్ హుడా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ. 

వెస్టిండీస్‌: షై హోప్, బ్రాండన్ కింగ్, షమ్రా బ్రూక్స్, కేల్ మయేర్స్, నికోలస్‌ పూరన్ (కెప్టెన్‌), అకీల్ హుసేన్, రొమారియో షెఫెర్డ్‌, అల్జారీ జోసెఫ్‌, గుడాకేష్‌ మోతీ, జయ్‌దెన్ సీలెస్‌. 

Also Read: Weight Loss Tips: ఖాళీ కడుపుతో దీన్ని తింటే.. ఇట్టే బరువు తగ్గుతారు! ట్రై చేసి చూడండి  

Also Read: Telugu Movies in OTT: ఒకే రోజు 13 సినిమాలు.. ఏయే యాప్ లో ఏయే సినిమా వస్తుందంటే?

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News