సౌతాఫ్రికా గడ్డపై సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించిన టీమిండియా

సౌతాఫ్రికాపై వన్డే సిరీస్ గెలిచిన కోహ్లీ సేన చరిత్ర సృష్టించింది.

Last Updated : Feb 17, 2018, 02:27 PM IST
సౌతాఫ్రికా గడ్డపై సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించిన టీమిండియా

సౌతాఫ్రికాపై వన్డే సిరీస్ గెలిచిన కోహ్లీ సేన చరిత్ర సృష్టించింది. సౌతాఫ్రికాతో 6 వన్డేల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన సెంచూరియన్‌లో నేడు జరిగిన ఆఖరి వన్డేలో టీమిండియా 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట టాస్ గెలిచిన టీమిండియా కెప్టేన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్ ప్రారంభించిన సఫారీలు 46.5 ఓవర్లకే ఆలౌట్ అయి 204 పరుగులు మాత్రమే చేయగలిగారు. సౌతాఫ్రికా ఆటగాళ్లలో ఒక్క ఖయ జొండో మాత్రమే 74 బంతుల్లో 54 పరుగులు చేసి ( 4x3, 6x2) అర్థ సెంచరీ మార్క్ అందుకోగా మిగతా వాళ్లు ఎవ్వరు అర్థ సెంచరీకి దరిదాపుల్లోకి కూడా రాలేకపోయారు. దీంతో సౌతాఫ్రికా 204 పరుగులకే పరిమితమైంది.

అనంతరం 205 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాను గెలిపించే బాధ్యతను తాను మాత్రమే తీసుకున్నానన్నట్టుగా రెచ్చిపోయాడు కెప్టేన్ విరాట్ కోహ్లీ. ఆఖరి వన్డేలోనూ సెంచరీ చేసి మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచిన కోహ్లీ 96 బంతుల్లో 129 పరుగులు ( 4x19, 6x2) చేశాడు. అంతకన్నా ముందే శిఖర్ ధావన్ 18 పరుగులు (34 బంతులు), రోహిత్ శర్మ 15 పరుగులు (13 బంతులు) లాంటి స్వల్ప స్కోర్‌కే పెవిలియన్ బాట పట్టినప్పటికీ విరాట్ కోహ్లీ దూకుడు, అజింక్య రహానే 34 పరుగులు (50 బంతుల్లో) టీమిండియాను 32.1 ఓవర్లకే 8 వికెట్ల తేడాతో విజయతీరాలకు చేర్చాయి.

Trending News