India vs Pakistan: T20 World cup లో10 హాఫ్ సెంచరీలు కొట్టిన తొలి ఆటగాడు Virat Kohli

Virat Kohli's half centuries in T20 World Cup matches: దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో పాకిస్థాన్‌తో జరిగిన నిన్నటి మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ల వికెట్లు టపటపా పడినా.. విరాట్ కోహ్లీ (Virat Kohli) మాత్రం రిషబ్ పంత్, రవీంద్ర జడేజాలతో (Rishabh Pant, Ravindra Jadeja) భాగస్వామ్యం చేసుకుంటూ ఆటను ముందుకు సాగించాడు.

Written by - Pavan | Last Updated : Oct 25, 2021, 05:17 PM IST
  • టీమిండియా ఓడినా.. విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు
  • టీమిండియాను గెలిపించేందుకు చేసిన హాఫ్ సెంచరీతోనే కోహ్లీ ఖాతాలో రికార్డు
  • విరాట్ కోహ్లీ తర్వాత స్థానంలో కొనసాగుతున్న క్రిస్ గేల్, మహెలా జయవర్థనె, రోహిత్ శర్మ
India vs Pakistan: T20 World cup లో10 హాఫ్ సెంచరీలు కొట్టిన తొలి ఆటగాడు Virat Kohli

Virat Kohli's half centuries in T20 World Cup matches: ఇండియా vs పాకిస్థాన్ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో భారత్ ఓటమిపాలైనప్పటికీ.. టీమిండియాను గెలిపించే ప్రయత్నం చేసిన కేప్టేన్ విరాట్ కోహ్లీ వ్యక్తిగత ఖాతాలో మాత్రం ఓ రికార్డు నమోదైంది. ఇప్పటివరకు టీ వరల్డ్ కప్ మ్యాచుల్లో 10 హాఫ్ సెంచరీలు కొట్టిన తొలి ఏకైక ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డు సాధించాడు. ఆదివారం నాడు పాకిస్థాన్‌తో జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 49 బంతుల్లో 57 పరుగులు చేయడం ద్వారా ఈ రికార్డును (most half centuries in T20 world cups) సొంతం చేసుకున్నాడు. 

పాకిస్థాన్‌తో మ్యాచ్ ముందు వరకు వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ 9 అర్థ సెంచరీలతో సమానమైన రికార్డ్ షేర్ చేసుకున్నారు. కానీ నిన్న ఆదివారం పాకిస్థాన్‌పై చేసిన హాఫ్ సెంచరీతో విరాట్ కోహ్లీ ఖాతాలో 10 హాఫ్ సెంచరీలు వచ్చి చేరాయి. దీంతో టీ20 వరల్డ్ కప్‌లో 10 హాఫ్ సెంచరీలు కొట్టిన తొలి ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డు సొంతం చేసుకున్నాడు.

టీ20 వరల్డ్ కప్‌లో అత్యథిక హాఫ్ సెంచరీలు సాధించిన వారి స్థానంలో విరాట్ కోహ్లీ తర్వాత రెండో స్థానంలో క్రిస్ గేల్ (Chris Gayle) ఉండగా ఆ తర్వాత 7 అర్థ సెంచరీలతో శ్రీలంక మాజీ కేప్టేన్ మహెలా జయవర్థనె ఉన్నాడు. ఆ తర్వాత 6 హాఫ్ సెంచరీలతో నాలుగో స్థానంలో మళ్లీ మన టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మనే (Rohit Sharma) ఉన్నాడు.

Also read : India Vs Pakistan: 'షమీ నువ్వు పాకిస్తాన్ వెళ్ళిపో అంటూ'.. బూతులు తిడుతున్న నెటిజన్లు

దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో పాకిస్థాన్‌తో జరిగిన నిన్నటి మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ల వికెట్లు టపటపా పడినా.. విరాట్ కోహ్లీ (Virat Kohli about Rohit Sharma's duckout) మాత్రం రిషబ్ పంత్, రవీంద్ర జడేజాలతో భాగస్వామ్యం చేసుకుంటూ ఆటను ముందుకు సాగించాడు. 4వ వికెట్ పడే సమయానికి రిషబ్ పంత్‌తో (Rishabh Pant) కలిసి 40 బంతుల్లో 53 పరుగుల భాగస్వామ్యం పూర్తి చేసిన విరాట్ కోహ్లీ.. 5వ వికెట్ పడే సమయానికి రవీంద్ర జడేజాతో (Ravindra Jadeja) కలిసి 33 బంతుల్లో 41 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.

Also read : Babar Azam about Ind vs Pak match result: ఇండియాపై పాక్ విజయంపై బాబర్ ఆజం ఏమన్నాడంటే

Also read : India Vs Pakistan: గెలుపు తరువాత భావోద్వేగాయానికి గురైన బాబర్ అజామ్ తండ్రి.. వీడియో వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News