కోహ్లీసేనకు ఊహించని ఎదురుదెబ్బ; 6 పరుగులకే కీలక 3 వికెట్లు !

భారత్ - కివీస్ సెమీస్ పోరులో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి

Last Updated : Jul 10, 2019, 04:14 PM IST
కోహ్లీసేనకు ఊహించని ఎదురుదెబ్బ; 6 పరుగులకే కీలక 3 వికెట్లు !

వరల్డ్ కప్ సెమీఫైనల్లో కివీస్ ఉంచిన టార్గెట్ ను చేధించేందుకు బరిలోకి దిగిన కోహ్లీసేనకు ఊహించని ఎదురదెబ్బ తగిలింది. కేవలం నాలుగు ఓవర్లు ఆడిన టీమిండియా ఆరు పరుగులకే కీలకమైన మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. సూపర్ ఫాంలో ఉన్న హిట్ మ్యాన్ రోహిత్ కేవలం 4 బంతులు ఎదుర్కొని ఒక పరుగు చేసి  మ్యాత్ హెన్నీ బౌలింగ్ లో టామ్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాటపడ్డారు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ (1) కూడా బౌల్ట్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ రూపంలో ఔట్ అయి క్రీజును వదిలాడు. అనంతరం వచ్చిన రిషబ్ పంత్ కూడా కేవలం ఒకే ఒక్క పరుగు చేసి ఔట్ అయ్యాడు. ఇలా ఎవరూ ఊహించని విధంగా  కోహ్లీసేన వరుసగా పెవిలియన్ బాట పడుతుంటే భారత అభిమానులు నిరాశగా చూస్తున్నారు. 
 

Trending News