/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

మూడు టీ20ల భాగంగా మంగళవారం మాంచెస్టర్‌లో జరిగిన తొలి టీ20లో ఇంగ్లాండ్‌పై భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో అద్భుతంగా కీపింగ్‌ చేసి ధోనీ అరుదైన రికార్డును సాధించాడు. ఇంగ్లండ్‌ ప్లేయర్స్ బెయిర్‌స్టో, జో రూట్‌ల‌ను స్టంపౌట్స్ చేసిన ధోనీ అంతర్జాతీయ అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక స్టంపౌట్స్(33) చేసిన వికెట్ కీపర్‌గా ప్రపంచ రికార్డ్‌ సాధించాడు. పాకిస్తాన్‌ వికెట్‌ కీపర్‌ కమ్రాన్‌ అక్మల్‌(32) పేరిట ఉన్న రికార్డును ధోని అధిగమించాడు.

మాంచెస్టర్ మ్యాచ్‌లో 14వ ఓవర్లో కుల్దీప్‌ వేసిన మూడో బంతికి ధోని అద్భుతంగా స్టంపింగ్‌ చేయడంతో బెయిర్‌స్టో (0) ఔటయ్యాడు. ఈ వికెట్‌తో కమ్రాన్‌ అక్మల్‌ పేరిట ఉన్న స్టంపౌట్ల రికార్డును ధోని సమం చేశాడు. ఆ తరువాతి బంతికే జో రూట్‌ను ధోని స్టంపౌట్‌ చేసి పెవిలియన్‌ బాట పట్టించాడు. దీంతో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక స్టంపౌట్స్ చేసిన వికెట్‌ కీపర్‌గా ధోని అగ్రస్థానంలో నిలిచాడు. అటు కొహ్లీ భారత్ తరఫున టీ20లలో 2 వేల పరుగులు పూర్తి చేసిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు.  

టీ20ల్లో అత్యధిక స్టంపింగ్స్‌ చేసిన వికెట్‌ కీపర్లు: 33 ఎంఎస్‌ ధోనీ(33), కమ్రాన్‌ అక్మల్‌(32), మహ్మద్‌ షెహజాద్‌(28), ముష్ఫీకర్‌ రహీం(26), కుమార సంగక్కర(20)

Section: 
English Title: 
India vs England 1st T20I: ms dhoni did most stumpings t20is
News Source: 
Home Title: 

నెంబర్ వన్ వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీనే

నెంబర్ వన్ వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీనే
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
నెంబర్ వన్ వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీనే