India Vs Australia :పుజారా సెంచరీ; ఆసీస్ టూర్ లో సరికొత్త రికార్డు 

ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ లో పుజారా సూపర్ ఫాం కొనసాగిస్తున్నాడు

Last Updated : Jan 3, 2019, 04:36 PM IST
India Vs Australia :పుజారా సెంచరీ; ఆసీస్ టూర్ లో సరికొత్త రికార్డు 

సిడ్నీ వేదికగా ఆసీస్ తో జరుగుతున్న నాల్గో టెస్టులో టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ ఛతేశ్వర పుజారా మరోమారు సెంచరీతో కదంతొక్కాడు.దీంతో పుజారా త‌న టెస్ట్ కెరీర్‌లో సెంచ‌రీల సంఖ్య 18కి పెంచుకున్నాడు. తాజా సెంచరీతో ఈ సిరీస్ లో మూడు సెంచరీలు చేసినట్లయింది. పుజారా మ‌రో అరుదైన రికార్డును కూడా చేరుకున్నాడు. ఈ సిరీస్‌లో పుజారా 200 లేదా అంత‌కంటే ఎక్కువ బంతులు ఆడ‌డం ఇది నాలుగో సారి. ఆస్ట్రేలియాలో ఒక భార‌త బ్యాట్స్‌మెన్ నాలుగు సార్లు 200 లేదా అంత‌కంటే ఎక్కువ బంతుల‌ను ఎదుర్కోవ‌డం ఇదే ప్రధమం. సిరీస్ ఫలితాన్ని శాసించే కీలకమైన నాల్గో టెస్టులో ఛతేశ్వర పుజారా సెంచరీతో భారత్ పటిష్ఠ స్థితికి చేరుకుంది
 

Trending News