తొలి ఇన్నింగ్ లో అద్భుత ప్రదర్శన చేసి ఔరా అనిపించిన కోహ్లీ సేన ..రెండో ఇన్నింగ్ లో వచ్చేసరికి అత్యంత ఫ్లాప్ షో ప్రదర్శిస్తోంది. ప్రస్తుతం టీమిండియా తన రెండో ఇన్నింగ్ లో 22 ఓవర్లు ఎదుక్కొని 44 మాత్రమే చేసి కీలకమైన ఐదు వికెట్ల కోల్పోయింది. ఓపెనర్లు విహారి 13, అగర్వాల్ 25 పరుగులు చేసి ఔట్ కాగా ఆ తర్వాత వచ్చిన పుజరా, విరాట్ కోహ్లీ డకౌట్ గా వెనుదిరిగారు. ఆ తర్వాత బరిలోకి దిగిన అజెంక్యా రహానే 1, రోహిత్ శర్మ 5 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టారు. ఇప్పటి వరకు టీమిండియా 335 పరుగుల ఆధిక్యంలో ఉంది.
ఫాలో ఆన్ ఆడించకపోవడం తప్పేనా ?
టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 7 వికెట్లకు 443 పరుగు భారీ స్కోర్ చేసి ఇన్నింగ్ ను డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. ఆసీస్ 151 పరుగులకే చేతులెత్తేయడంతో తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 292 పరుగుల లీడ్ సాధించింది. ఆసీస్ కు ఫాలోఆన్ ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ...భారత్ రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించడం గమనార్హం. ఫాలో ఆన్ ఆడించకుండా రెండో ఇన్నింగ్ ప్రారంభించాలనే కోహ్లీ నిర్ణయంపై విమర్శలు వస్తున్నాయి. ఫాలో ఆన్ ఆడించి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.