India vs Australia 2nd ODI match: ఇండియా vs ఆస్ట్రేలియా 2వ వన్డేలో రిశబ్ పంత్, శార్ధూల్ ఠాకూర్‌ల స్థానంలో మరో ఇద్దరికి చోటు

రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌ భారత జట్టుకు కీలకం కానుంది. ఎందుకంటే వాంఖడే స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా విజయం సాధించి 1-0 తేడాతో ముందంజలో ఉంది. ఈ రెండో వన్డేలోనైనా ఆస్ట్రేలియాను భారత్ ఓడించకపోతే.. అప్పుడు సిరీస్ ఆసిస్ వశమైనట్టే.

Last Updated : Jan 17, 2020, 02:29 PM IST
India vs Australia 2nd ODI match: ఇండియా vs ఆస్ట్రేలియా 2వ వన్డేలో రిశబ్ పంత్, శార్ధూల్ ఠాకూర్‌ల స్థానంలో మరో ఇద్దరికి చోటు

రాజ్‌కోట్: ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు జరగనున్న రెండో మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టేన్ అరోన్ ఫించ్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌ భారత జట్టుకు కీలకం కానుంది. ఎందుకంటే వాంఖడే స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా విజయం సాధించి 1-0 తేడాతో ముందంజలో ఉంది. ఈ రెండో వన్డేలోనైనా ఆస్ట్రేలియాను భారత్ ఓడించకపోతే.. అప్పుడు సిరీస్ ఆసిస్ వశమైనట్టే. అందుకే రాజ్‌కోట్ వన్డే కోహ్లీ సేనకు కీలకంగా మారింది. రెండో వన్డేలో రిషబ్ పంత్ స్థానంలో మనీష్ పాండే, శార్ధూల్ ఠాకూర్ స్థానంలో నవదీప్ షైనీని జట్టులోకి తీసుకున్నారు.

టీమిండియా తరపున రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ క్రీజులోకి వచ్చి ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఆసిస్ తరపున తొలి ఓవర్ విసిరిన కమ్మిన్స్ మెయిడెన్ సాధించాడు. 

Read also : ‘విరాట్ కోహ్లీ నిర్ణయం భారత్ కొంపముంచింది’

టీమిండియా ఆటగాళ్ల జాబితా: 
శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), విరాట్ కోహ్లీ (కెప్టేన్), శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, రవింద్ర జడేజా, నవదీప్ సైనీ, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ షమి, జస్ప్రిత్ బుమ్రా.

ఆసిస్ ఆటగాళ్ల జాబితా: 
డేవిడ్ వార్నర్, అరోన్ ఫించ్ (కెప్టేన్), మార్నస్, స్టీవెన్ స్మిత్, అలెక్స్, ఆస్టన్ టర్నర్, ఆస్టన్ అగర్, ప్యాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్, కేన్ రిచర్డ్సన్, ఆడం జంపా.
 జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News