India Vs Australia : సేఫ్ జోన్ లో కోహ్లీసేన; అదరగొట్టిన పుజారా,అగర్వాల్

పుజారా, అగర్వాల్ రాణించడంతో కీలకమైన నాల్గో టెస్టులో కోహ్లీసే పటిష్ట స్థితిలో నిలిచింది

Last Updated : Jan 3, 2019, 04:34 PM IST
India Vs Australia : సేఫ్ జోన్ లో కోహ్లీసేన; అదరగొట్టిన పుజారా,అగర్వాల్

సిరీస్ ఫలితాన్ని శాసించే చిట్టచివరి టెస్టులో టీమిండియా బ్యాట్స్ మెన్లు అదరగొడుతున్నారు. ప్రధానంగా పుజరా సెంచరీతో రాణిస్తుండగా..యంగ్ ఓపెనర్ అగర్వాల్ ఆసీస్ బౌలర్లను చిత్తు చేశాడు. ఫలితంగా భారత్ మ్యాచ్ పై పట్టుబిగించే స్ధితిలో నిలిచింది. తొలి రోజు ఆటలో మొత్తం 90 ఓవర్లు ఎదర్కొన్న టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయి 303 పరుగులు సాధించింది. 

బ్యాటింగ్ సాగిందిలా...

ఉదయం టాస్ గెలిచి కెప్టెన్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.  ఓపెన‌ర్ రాహుల్ (9) అవుటైన అనంత‌రం క్రీజులోకి వ‌చ్చిన పుజారా (130 నాటౌట్‌) శ‌త‌కం సాధించాడు. మరో యువ ఓపెనర్ అగర్వాల్ 77 పరుగులతో మరోసారి రాణించాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ (23 ) నిలదొక్కుకునే క్రమంలో ఔట్ అయ్యాడు. ఈ పర్యటనలో ఆశించిన స్థాయిలో ప‌రుగులు చేయ‌లేక‌పోతున్న మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ అజింక్యా ర‌హానే తాజా టెస్ట్‌లోనూవిఫ‌ల‌మ‌య్యాడు. కేవ‌లం 18 ప‌రుగులు మాత్రమే చేసి అవుట‌య్యాడు.

 ఆసీస్ కు కష్టాలు తప్పవు

తొలి రోజు ఆటముగిసే సమయానికి పుజారా ( 128) పరుగులు, హనమ విహారి 39 పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు.. రెండో రోజు ఈ భాగస్వామం కొనసాగితే ఆసీస్ కు కష్టాల తప్పవని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆసీస్ బౌలింగ్ విషయానికి వస్తే హాజిల్ వుడ్ 2 వికెట్లు తీయగా.. స్ట్రాస్,లియాన్ చెరో ఒక వికెట్ తీశారు.

Trending News