India Open 2022 Final: ఇండియా ఓపెన్ 2022 పురుషుల సింగిల్స్ ఫైనల్లో (India Open 2022 Final) యువ షట్లర్ లక్ష్య సేన్ ( Lakshya Sen) ఘన విజయం సాధించాడు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ టోర్నమెంట్లో భాగంగా ఆదివారం జరిగిన పోటీల్లో... ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ లోహ్ కీన్ యూను (Loh Kean) 24-22, 21-17తో వరుస గేమ్‌లలో ఓడించి తన తొలి ఇండియా ఓపెన్ టైటిల్‌ను గెలుచుకున్నాడు లక్ష్యసేన్. 20 ఏళ్ల సేన్, గత నెలలో స్పెయిన్‌లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్ లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు.
పురుషుల డబుల్స్‌లో భారత స్టార్ బ్యాడ్మింటన్ జోడి సాత్విక్ సాయిరాజ్ - చిరాగ్ శెట్టి (Satwiksairaj Rankireddy- Chirag Shetty) చరిత్ర సృష్టించారు. తొలిసారిగా ప్రతిష్ఠాత్మక ఇండియా ఓపెన్ టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. ఆదివారం జరిగిన ఫైనల్లో మూడు సార్లు ప్రపంచ ఛాంపియన్లు అయిన ఇండోనేసియా జోడి మహ్మద్ అహ్సన్-హెండ్రా సెటియావాన్‌ను ఓడించారు. 43 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో.. రెండు వరుస సెట్లలో 21-16, 26-24 పాయింట్లతో ప్రత్యర్థిని మట్టికరిపించారు. తద్వారా ఇండియన్ ఓపెన్ టైటిల్ ను గెలిచిన మొట్టమొదటి డబుల్స్ జోడిగా (doubles pair) నిలిచారు. మహిళల సింగిల్స్ ఫైనల్లో బుసానన్ (థాయిలాండ్) 22-20, 19-21, 21-13తో సుపనిద(థాయిలాండ్) పై నెగ్గింది.
Also Read: Anushka Sharma Emotional Note: టెస్ట్ కెప్టెన్సీకి కోహ్లీ గుడ్‌బై.. అనుష్క శర్మ ఎమోషనల్ పోస్ట్!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook