IND vs NZ: భారత్ ఔట్ డేటేడ్ టీమ్.. మైఖేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు!

IND vs NZ 1st ODI: Michael Vaughan trolls Wasim Jaffer and India. బ్లాక్ క్యాప్స్ డేటేడ్ టీమ్ అని ఆకాశానికి ఎత్తిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్‌.. టీమిండియాను ట్రోల్ చేశాడు.   

Written by - P Sampath Kumar | Last Updated : Nov 26, 2022, 12:05 PM IST
  • న్యూజిలాండ్‌ను ప్రశంసించి టీమిండియాను ట్రోల్ చేశాడు
  • భారత్ ఔట్ డేటేడ్ టీమ్
  • మైఖేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు
IND vs NZ: భారత్ ఔట్ డేటేడ్ టీమ్.. మైఖేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు!

Michael Vaughan trolls India and Wasim Jaffer: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, కామెంటేటర్ మైఖేల్ వాన్‌ ఎప్పుడూ భారత జట్టుకు వ్యతిరేకంగా ఉంటాడు. వీలుచిక్కినప్పుడల్లా టీమిండియాపై తన అక్కసు వెళ్లగక్కుతుంటాడు. చిన్న చిన్న విషయాలను కూడా హైలెట్ చేసి.. కామెంట్స్, ట్వీట్స్ చేస్తుంటాడు. పిచ్, మ్యాచ్, ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శనపై మాట్లాడుతూ నిత్యం వార్తల్లో ఉంటాడు. అయితే టీమిండియా మాజీ ఓపెనర్ వసీమ్ జాఫర్.. వాన్‌పై ఎప్పటికప్పుడు సెటైర్లు పేల్చుతుంటాడు. దాంతో ఇద్దరి మధ్య ఎప్పటినుంచో ట్విట్టర్ వార్ జరుగుతోంది. తాజాగా మరోసారి జాఫర్, వాన్‌ సోషల్ మీడియాలో కొట్టుకున్నారు. 

న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శుక్రవారం (నవంబర్ 25) జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఎప్పటిలానే బౌలింగ్ వైఫల్యంతో 307 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేకపోయింది. ఈ మ్యాచుపై ముందుగా వసీమ్ జాఫర్ స్పందించాడు. 'న్యూజిలాండ్‌ జట్టు బాగా ఆడింది. 300 భారీ లక్ష్యాన్ని కూడా 270 అన్నట్టుగానే ఛేదించింది. కేన్ విలియమ్సన్ ఎప్పటిలాగే క్లాస్ ఇన్నింగ్స్ ఆడాడు. కానీ టామ్ లాథమ్ క్రెడిట్ మొత్తం ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఓపెనర్ మిడిల్ ఆర్డర్లో వచ్చి విజయవంతం కావడం అంత సులభం కాదు. భారత్ ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగి మూల్యం చెల్లించుకుంది' అని జాఫర్ ట్వీట్ చేశాడు. 

వసీమ్ జాఫర్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అదనుకోసం వేచిచూస్తున్న మైఖేల్ వాన్‌.. న్యూజిలాండ్‌ను ప్రశంసించి టీమిండియాను ట్రోల్ చేశాడు. బ్లాక్ క్యాప్స్ డేటేడ్ టీమ్ అని ఆకాశానికి ఎత్తిన వాన్‌.. భారత్ ఔట్ డేటేడ్ టీమ్ అని పరోక్షంగా అన్నాడు. 'న్యూజిలాండ్ డేటేడ్ టీమ్. మీరు ఆరుగురు లేదా ఏడుగురు బౌలింగ్ ఆప్షన్స్ తో బరిలోకి దిగాలి' అని వసీమ్ జాఫర్ ట్వీట్‌ను మైఖేల్ వాన్‌ రీట్వీట్ చేశాడు. వాన్‌ ట్వీట్ చూసిన భారత జట్టు అభిమానులు అతడిపై మండిపడుతున్నారు. మైఖేల్ వాన్‌ మూసుకొని ఉండు, మైఖేల్ వాన్‌ చెత్త వాగుడు వాగుకు అని ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 306 రన్స్ చేసింది. శ్రేయస్ అయ్యర్ (80), శిఖర్ ధావన్ (72), శుభ్‌మన్ గిల్ (50) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇన్నింగ్స్ చివరలో వాషింగ్టన్ సుందర్(16 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో టీమ్ సౌథీ, లూకీ ఫెర్గూసన్ మూడేసి వికెట్లు తీశారు. అనంతరం న్యూజిలాండ్ 47.1 ఓవర్లలో 3 వికెట్లకు 309 పరుగులు చేసి గెలిచింది. టామ్ లాథమ్ (145 నాటౌట్) అజేయ శతకం చేయగా.. కేన్ విలియమ్సన్ (94 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.

Also Read: Umran Malik: ఉమ్రాన్‌కు అతిపెద్ద బలం అదే.. ప్రశంసలు కురిపించిన భారత మాజీ పేసర్!

Also Read: Sunny Leone Pics: సన్నీ లియోన్ హాట్ ట్రీట్.. కుర్రాళ్లకు కునుకులేకుండా చేస్తున్న లేటెస్ట్ పిక్స్!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook.

Trending News