India vs Australia, 2nd ODI match : రెండో వన్డేలో గెలిచిన టీమిండియా.. ఇక మూడో వన్డే ఎప్పుడు ? ఎక్కడ ?

ఆసిస్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 36 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో ఆసిస్ గెలవగా రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా జరిగిన నేటి మ్యాచ్‌లో భారత్ గెలవడంతో మూడు వన్డేల సిరీస్ 1-1తో సమమైంది.

Last Updated : Jan 17, 2020, 10:04 PM IST
India vs Australia, 2nd ODI match : రెండో వన్డేలో గెలిచిన టీమిండియా.. ఇక మూడో వన్డే ఎప్పుడు ? ఎక్కడ ?

ఆసిస్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 36 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో ఆసిస్ గెలవగా రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా జరిగిన నేటి మ్యాచ్‌లో భారత్ గెలవడంతో మూడు వన్డేల సిరీస్ 1-1తో సమమైంది. అంతేకాకుండా సిరీస్‌పై టీమిండియా ఆశలు సజీవం చేసుకుంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు బౌలింగ్ ఎంచుకోవడంతో టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి టీమిండియా 340 పరుగులు చేయగా.. 341 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసిస్ జట్టు.. నిర్ణీత ఓవర్లకు మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే 304 పరుగుల వద్ద ఆలౌటైంది. దీంతో టీమిండియా రెండో వన్డేలో 36 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Read also : Shikhar Dhawan: శిఖర్ ధావన్ సెంచరీ మిస్

రెండు వన్డేల్లో రెండు జట్లు చెరో విజయం సాధించడంతో ఇక బెంగళూరులోని చినస్వామి స్టేడియంలో జరగనున్న థర్డ్ వన్డేపైనే ప్రస్తుతం క్రికెట్ ప్రియుల దృష్టి కేంద్రీకృతమై ఉంది. మూడో మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే వారినే సిరీస్ వరించనుండటంతో ఇరు జట్లకు మూడో వన్డే కీలకంగా మారింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News