IND Vs ENG 4th Test: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 466 పరుగులకు ఆలౌటైంది. రెండో సెషన్‌లో పంత్ (50), శార్దూల్ ఠాకూర్ (60) అద్భుత బ్యాటింగ్‌కు తోడు టెయిలెండర్లు ఉమేశ్ యాదవ్ (25), బుమ్రా (24) రాణించారు. దీంతో భారత్ భారీ స్కోర్ సాధించడమే కాకుండా ఇంగ్లాండ్ ముందు 368 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అంతకుముందు కెప్టెన్ విరాట్ కోహ్లీ (44), రవీంద్ర జడేజా (17) నాలుగో వికెట్‌కు అర్ధశతక భాగస్వామ్యం జోడించారు. నిన్న రోహిత్ శర్మ అద్వితీయ సెంచరీ (127) చేయగా, ఛతేశ్వర్ పుజారా (61) అర్ధ శతకం సాధించాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 3 వికెట్లు పడగొట్టాడు. ఓలీ రాబిన్సన్, మొయిన్ అలీ తలో రెండు వికెట్లు తీశారు.
శార్దూల్ కొత్త చరిత్ర
నాలుగో టెస్టులో టీమిండియా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur)కొత్త రికార్డును అందుకున్నాడు. ఎనిమిదో స్థానంలో వచ్చి ఒకే టెస్టు మ్యాచ్‌లో రెండు అర్థసెంచరీలు సాధించిన నాలుగో టీమిండియా బ్యాట్స్‌మన్‌గా శార్దూల్ ఠాకూర్(Shardul Thakur) నిలిచాడు. ఇంతకముందు హర్భజన్ సింగ్( వర్సెస్ న్యూజిలాండ్ , అహ్మదాబాద్, 2010); భువనేశ్వర్ కుమార్( వర్సెస్ ఇంగ్లండ్, నాటింగ్‌హమ్, 2014); వృద్ధిమాన్ సాహా( వర్సెస్ న్యూజిలాండ్, కోల్‌కతా, 2016) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.
Also read: Ind Vs Eng : టీమ్‌ఇండియా హెడ్ కోచ్ రవిశాస్త్రికి కరోనా పాజిటివ్
కేఎల్ రాహుల్‌కి జరిమానా
టీమ్‌ఇండియా బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్(KL Rahul)కి ఐసీసీ జరిమానా విధించింది. అంపైర్ నిర్ణయంపై రాహుల్ అసంతృప్తి వ్యక్తం చేసిన కారణంగా అతని మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించారు. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ లెవల్ 1 తప్పిదంగా పరిగణిస్తూ.. జరిమానాతో వదిలేశారు.
అసలేం జరిగిందంటే..
ఇంగ్లాండ్, భారత్(INDIA) జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో మూడో రోజు తొలి సెషన్‌లో అండర్సన్(Anderson) వేసిన 33.6 ఓవర్‌కు కేఎల్ రాహుల్(46).. కీపర్ జానీ బెయిర్ స్టోకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అయితే, తొలుత దీనిని ఆన్‌ఫీల్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు.దీంతో ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్(Joe Root) సమీక్షకు వెళ్లాడు. డీఆర్‌ఎస్‌లో రాహుల్ ఔటైనట్లు తేల్చారు. దీనిపై అతడు తీవ్ర అసంతృప్తి చేశాడు.
భారత్ తొలి ఇన్నింగ్స్: 191/10
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్: 290/10
భారత్ రెండో ఇన్నింగ్స్: 466/10
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook