IND Vs WI T20 Squad: టీమిండియా జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యా.. తెలుగు కుర్రాడికి చోటు

India Squad For T20 Series Vs WI: ఐపీఎల్‌లో మెరుపులు మెరిపించిన యంగ్ ప్లేయర్లకు సెలక్టర్ల నుంచి తొలిసారి పిలుపువచ్చింది. వెస్టిండీస్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించారు. యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, ముకేశ్ కుమార్ తొలిసారి జట్టులో ఎంపికయ్యారు.  

Written by - Ashok Krindinti | Last Updated : Jul 6, 2023, 06:39 AM IST
IND Vs WI T20 Squad: టీమిండియా జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యా.. తెలుగు కుర్రాడికి చోటు

India Squad For T20 Series Vs WI: వెస్టిండీస్‌తో జరిగే టీ20 సిరీస్‌కు టీమిండియాను బీసీసీఐ ప్రకటించింది. మరోసారి టీ20ల నుంచి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని పక్కనబెట్టగా.. హార్దిక్ పాండ్యా జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. సూర్యకుమార్ యాదవ్ జట్టు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఐపీఎల్‌లో అదరగొట్టిన యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, ముకేశ్ కుమార్ వంటి యంగ్ ప్లేయర్లకు సెలక్టర్ల నుంచి పిలుపు వచ్చింది. అయితే రింకూ సింగ్‌కు చోటు దక్కుతుందని అందరూ భావించినా.. ఈ పవర్‌ హిట్టర్‌కు నిరాశ ఎదురైంది. వన్డే జట్టులో చోటు దక్కించుకున్న ఉమ్రాన్‌ మాలిక్‌కు టీ20 జట్టులోనూ చోటు దక్కించుకున్నాడు. చీఫ్ సెలక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన అజిత్ అగార్కర్.. తొలి సెలక్షన్‌లోనే తనదైన మార్క్ వేశారు. జట్టును మొత్తం కుర్రాళ్లతో నింపేశారు.

ఇషాన్ కిషన్‌తో సంజూ శాంసన్‌ను వికెట్ కీపర్‌గా ఎంపిక చేశారు. గిల్‌తో కలిసి ఇషాన్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉండగా.. సంజూ మిడిల్ ఆర్డర్‌లో ఆడనున్నాడు. స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌, ఫాస్ట్‌బౌలర్‌ అవేష్‌ ఖాన్‌లు మళ్లీ జట్టులోకి వచ్చారు. ఆల్‌రౌండర్‌గా అక్షర్ పటేల్‌ను తీసుకోగా.. రవీంద్ర జడేజాకు విశ్రాంతి ఇచ్చారు. అర్ష్‌దీప్‌ సింగ్‌ పేస్‌ విభాగానికి నేతృత్వం వహించనున్నాడు.  

వెస్టిండీస్‌లో భారత పర్యటన జూలై 12న డొమినికాలో మొదటి రెండు టెస్టుల సిరీస్‌తో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత జూలై 27 నుంచి ఆగస్టు 1 వరకు మూడు వన్డేలు ఆడనున్నారు. చివరి రెండు వన్డేలు అమెరికాలోని ఫ్లోరిడాలో వేదికగా జరుగుతాయి. తరువాత ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభంకానుంది. టెస్టుల, వన్డేలు ఆడునున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. టీ20ల నుంచి ఇక దాదాపు తప్పుకున్నట్లే. టీ20 వరల్డ్ కప్ ముగిసిన తరువాత ఈ ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు మళ్లీ టీ20 జట్టుకు ఎంపిక అవ్వలేదు. వన్డే వరల్డ్ కప్‌పై రోహిత్, విరాట్ దృష్టిపెడుతుండగా.. 2024 టీ20 ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ టీమ్‌ను రెడీ చేస్తోంది.

వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు భారత్:

ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శుభ్‌మాన్ గిల్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (కెప్టెన్), అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్‌ సింగ్, ఉమ్రాన్ మాలిక్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.

Also Read: Ys jagan Delhi Tour: ముగిసిన జగన్ ఢిల్లీ పర్యటన, మోదీతో 80 నిమిషాల సమావేశం

Also Read: Salaar Teaser: సలార్‌ టీజర్ వచ్చేసింది.. పవర్‌ఫుల్ లుక్‌లో ప్రభాస్.. గూస్‌బంప్స్ పక్కా..!  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook  

Trending News