India Vs West Indies Match Toss and Playing 11: తొలి వన్డేలో వెస్టిండీస్‌ను చిత్తు చేసిన భారత్.. రెండో వన్డేలో చతిలకిల పడింది. కరేబియన్ జట్టు చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. దీంతో సిరీస్ గెలవాలంటే మూడో వన్డే తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు మూడో వన్డేలో గెలిచి వరల్డ్ కప్‌కు అర్హత సాధించలేకపోయామన్న బాధను మరిచిపోయేందుకు వెస్టిండీస్ టీమ్ ప్రయత్నిస్తోంది. తొలి రెండు వన్డేల్లో బ్యాటింగ్ ఆర్డర్‌లో టీమిండియా ప్రయోగాలు చేయగా.. బెడిసికొట్టాయి. నిర్ణయాత్మక చివరి మూడో వన్డేలో ఆతిథ్య విండీస్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మరోసారి విశ్రాంతి తీసుకోగా.. రుతురాజ్ గైక్వాడ్, జయదేవ్ ఉనద్కత్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చారు.
"మేము ముందుగా బౌలింగ్ చేస్తాం. పిచ్ నుంచి వీలైనంత సహకారం లభిస్తుందని భావిస్తున్నాం. గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే ఆడుతున్నాం. పిచ్ మంచిగా కనిపిస్తోంది. బంతి కొంచెం మెరుగ్గా వస్తుందని ఆశిస్తున్నాం. మేము ఫలితాలను స్థిరంగా సాధించాల్సిన అవసరం ఉంది." అని విండీస్ కెప్టెన్ షెయ్ హోప్ తెలిపాడు.
"తుది జట్టులో రెండు మార్పులు ఉన్నాయి. ఉమ్రాన్ మాలిక్ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్, అక్షర్ పటేల్ ప్లేస్ జయదేవ్ ఉనద్కత్ జట్టులోకి వచ్చారు. సిరీస్ డిసైడ్ చేసే మ్యాచ్ ఆడేందుకు అందరూ ఉత్సాహంగా ఉన్నాం. పిచ్ బాగుంది. పెద్దగా మారుతుందని నేను అనుకోను. మొదట బ్యాటింగ్ చేయడం వల్ల మంచి టార్గెట్‌ను విధించడానికి మాకు మంచి అవకాశం లభిస్తుంది.." టీమిండియా కెప్టెన్ హార్ధిక్ పాండ్యా తెలిపాడు.
తుది జట్లు ఇలా..
భారత్: ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జయదేవ్ ఉనద్కత్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్.
వెస్టిండీస్: బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, అలిక్ అథానాజ్, షెయ్ హోప్ (వికెట్ కీపర్, కెప్టెన్), షిమ్రాన్ హెట్‌మెయర్, కీసీ కార్టీ, రొమారియో షెపర్డ్, యానిక్ కరియా, అల్జారీ జోసెఫ్, గుడాకేష్ మోటీ, జేడెన్ సీల్స్.