Ind Vs WI 2nd Odi Live Score Updates West Indies opt To Bowl: వెస్టిండీస్‌పై టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత్.. వన్డే సిరీస్‌ను సొంతం చేసుకోవాలని చూస్తోంది. మొదటి వన్డేలో కరేబియన్ జట్టును చిత్తుగా ఓడించిన టీమిండియా.. నేడు వన్డేలోనూ ఓడించాలని చూస్తోంది. మరోవైపు పరువు కోసం ఆతిథ్య జట్టు పాకులాడుతోంది. కనీసం గట్టిపోటీ ఇవ్వాలని చూస్తోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌కు దూరమవ్వగా.. హార్ధిక్ పాండ్యా నాయకత్వం వహిస్తున్నాడు. బార్బడోస్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో విండీస్ టీమ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. రోహిత్, విరాట్ స్థానంలో సంజూ శాంసన్, అక్షర్ పటేల్ జట్టులోకి వచ్చారు. విండీస్ కూడా రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది.
"మేము మొదట బౌలింగ్ చేయాలని అనుకుంటున్నాం. లాస్ట్ మ్యాచ్‌లో ఏం జరిగిందో చూశాం. ఇక్కడి పరిస్థితులు బౌలర్లకు సహకరిస్తాయి. సిరీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే.. ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాలి. రెండు జట్లూ ఒకే పిచ్‌పై ఆడాలి. మేము ముందుగా బౌలింగ్ చేసి భారత్‌ను ఒత్తిడిలోకి నెట్టాలి. పావెల్, డ్రేక్స్ స్థానంలో అల్జారీ జోసెఫ్, కీసీ కార్టీ జట్టులోకి వచ్చారు.." అని విండీస్ కెప్టెన్ షై హోప్ తెలిపాడు.
"మేము మొదట బ్యాటింగ్ చేయాలని అనుకున్నాం. కాస్త అప్ అండ్ డౌన్‌గా ఉన్న ఈ పిచ్‌పై ఎంత స్కోరు చేస్తామో చూడాలి. రోహిత్, విరాట్ నిరంతరం క్రికెట్ ఆడుతున్నారు. ఈ గేమ్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు. మూడో వన్డేకు వారు తిరిగి వచ్చే అవకాశం ఉంది. మా బౌలింగ్, ఫీల్డింగ్ బాగుంది. కానీ మేము ఇంకా కొన్ని విషయాల్లో మెరుగు పడాల్సి ఉంది. ఐదు వికెట్లు కోల్పోయే బదులు రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చివరి మ్యాచ్‌ను గెలవాల్సింది. రోహిత్, విరాట్‌ల స్థానంలో సంజూ శాంసన్ , అక్షర్ పటేల్ జట్టులోకి వచ్చారు.." అని టీమిండియా కెప్టెన్ హార్ధిక్ పాండ్యా వెల్లడించాడు.
భారత్: శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, ముఖేష్ కుమార్
వెస్టిండీస్: బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, అలిక్ అథానాజ్, షై హోప్ (వికెట్ కీపర్, కెప్టెన్), షిమ్రాన్ హిట్‌మేయర్, కీసీ కార్టీ, రొమారియో షెపర్డ్, యానిక్ కరియా, గుడాకేష్ మోటీ, అల్జారీ జోసెఫ్, జేడెన్ సీల్స్.
Also Read: Bandi Sanjay: లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ టీమ్ రెడీ.. బండి సంజయ్‌కు ప్రమోషన్
Also Read: Tamil Nadu Blast: బాణసంచా గోడౌన్‌లో భారీ పేలుడు.. ఐదుగురు మృతి, 10 మందికి గాయాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి