India Vs West Indies Dream11 Team Prediction: పొట్టి ఫార్మాట్‌లో మేటిగా ఉన్న వెస్టిండీస్ టీమ్‌ను ఢీకొనేందుకు టీమిండియా రెడీ అయింది. ట్రినిడాడ్‌లోని తరౌబాలోని బ్రయాన్ లారా స్టేడియం వేదికగా గురువారం ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభంకానుంది. టెస్ట్, వన్డే సిరీస్‌లు సొంతం చేసుకున్న భారత్.. టీ20 సిరీస్‌ను కూడా సొంతం చేసుకోవాలని చూస్తోంది. హార్ధిక్ పాండ్యా నాయకత్వంలో టీమిండియా బరిలోకి దిగుతుండగా.. రోవ్‌మాన్ పావెల్ విండీస్ జట్టును నడిపించనున్నాడు. నేడు రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. పిచ్ రిపోర్ట్, తుది జట్టు ఎలా ఉండబోతుంది..? లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడాలి..? డ్రీమ్ 11 టీమ్ టిప్స్ మీ కోసం..
పిచ్ రిపోర్ట్ ఇలా..
బ్రయాన్ లారా స్టేడియంలో ఇప్పటివరకు ఒకే ఒక్క టీ20 మ్యాచ్‌కు ఆతిథ్యం ఇచ్చింది. 2022లో భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. దీంతో టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. ఆరంభంలో కాస్త పేసర్లకు సహరిస్తుంది. మ్యాచ్ సాగుతున్న కొద్దీ స్పిన్నర్లకు సహకారం లభిస్తుంది. భారత్-వెస్టిండీస్ మధ్య జరిగిన చివరి వన్డేకు ఈ పిచ్‌నే ఉపయోగించారు.
వేదిక: ట్రినిడాడ్‌లోని టరూబాలోని బ్రియాన్ లారా స్టేడియం
సమయం: రాత్రి 8 గంటల నుంచి
స్ట్రీమింగ్ వివరాలు: జియో సినిమా, ఫ్యాన్‌కోడ్ వెబ్‌సైట్, డీడీ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
తుది జట్లు ఇలా (అంచనా)
భారత్: శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ (కెప్టెన్), సూర్యకుమార్, అక్షర్ పటేల్, కుల్‌దీప్, చాహల్/రవి బిష్ణోయ్, ఉమ్రాన్ మాలిక్/అవేష్ ఖాన్, ముకేశ్‌కుమార్.
వెస్టిండీస్: మేయర్స్, కింగ్, హోప్/చార్లెస్ (వికెట్ కీపర్), నికోలస్ పూరన్, హెట్‌మయర్, రోమన్ పావెల్ (కెప్టెన్), రోస్టన్ చేజ్, జేసన్ హోల్డర్, రొమారియో షెఫర్డ్/ఒడియన్ స్మిత్, అకీల్, అల్జారి జోసెఫ్.
డ్రీమ్ 11 టిప్స్ ఇలా..
వికెట్ కీపర్లు: నికోలస్ పూరన్, ఇషాన్ కిషన్
బ్యాటర్లు: తిలక్ వర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, షిమ్రాన్ హిట్‌మేయర్
ఆల్‌రౌండర్లు: కైల్ మేయర్స్, హార్దిక్ పాండ్యా
బౌలర్లు: అల్జారీ జోసెఫ్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్
కెప్టెన్: శుభ్‌మన్ గిల్
వైస్ కెప్టెన్: నికోలస్ పూరన్
Also Read: Janjatiya Vikas: జీ మీడియా ఆధ్వర్యంలో ఈ నెల 5న 'జనజాతీయ వికాస్'.. వేడుకల్లో భారీగా పాల్గొనండి
Also Read: Tomato Price Today: టమాట ధరలకు మరింత రెక్కలు.. కేజీ ట్రిబుల్ సెంచరీ దిశగా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook
IND Vs WI Dream11 Tips: విండీస్‌తో నేడు తొలి టీ20.. డ్రీమ్ 11 టిప్స్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇలా..