World Cup 2023: ప్రపంచకప్‌కు ముందు వన్డేల్లో నెం.1గా నిలిచేదెవరు..? లెక్కలు ఇలా..!

ICC ODI Ranking: ఆసియాకప్ విజయంతో టీమిండియా వన్డేల్లో నెంబర్ వన్ ర్యాంక్‌కు మరింత చేరువ అయింది. ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే సిరీస్‌ను గెలుచుకుంటే.. వరల్డ్ కప్‌లో నెంబర్ వన్ టీమ్‌గా అడుగుపెట్టనుంది. భారత్‌కు ఆస్ట్రేలియా, పాక్ రూపంలో ముప్పు పొంచి ఉంది.   

Written by - Ashok Krindinti | Last Updated : Sep 18, 2023, 02:19 PM IST
World Cup 2023: ప్రపంచకప్‌కు ముందు వన్డేల్లో నెం.1గా నిలిచేదెవరు..? లెక్కలు ఇలా..!

ICC ODI Ranking: ఆసియా కప్‌ ఫైనల్ శ్రీలంకను 10 వికెట్ల తేడాతో చిత్తు చేసిన టీమిండియా.. వరల్డ్ కప్‌లో ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపించింది. బౌలింగ్‌లో కాస్త బలహీనంగా కనిపించినా.. ఆదివారం శ్రీలంకతో మ్యాచ్‌ బౌలింగ్‌పై ఉన్న అనుమానాలు పటాపంచలు అయ్యాయి. సిరాజ్‌ పేస్ దాడికి శ్రీలంక బ్యాట్స్‌మెన్ కుదేలయ్యారు. ఇక వరల్డ్ కప్‌కు వన్డే ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ టీమ్‌గా ఎవరు ఇంట్రీ ఇవ్వనున్నారనేది ఆసక్తికరంగా మారింది. ప్రధానంగా పాకిస్థాన్, భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య పోటీ నెలకొంది. అయితే ప్రపంచ కప్‌ వరకు పాక్‌కు మ్యాచ్‌లు లేకపోవడంతో.. భారత్-ఆసీసీ వన్డే సిరీస్‌ తరువాత నెంబర్ వన్ జట్టు ఏదో తేలిపోనుంది.

ఆసియా కప్ సూపర్-4లో బంగ్లాదేశ్‌పై భారత్ గెలిచి ఉంటే.. నంబర్ వన్ స్థానానికి చేరేది. అటు దక్షిణాఫ్రికాతో ఐదు వన్డేల సిరీస్‌ను 2-3తో కోల్పోయిన ఆస్ట్రేలియా.. వన్డే ర్యాంకింగ్‌లో కూడా మూడవ స్థానానికి పడిపోయింది. పాక్ జట్టు ప్రస్తుతం నెంబర్ వన్ టీమ్‌గా ఉంది. ఆసియా కప్ 2023 ఫైనల్‌కు చేరుకోవడంలో విఫలమైనా.. భారత్ కంటే తక్కువ మ్యాచ్‌లు ఆడిన కారణంగా 115 రేటింగ్ పాయింట్లతో ఫస్ట్‌ ర్యాంక్‌లో నిలిచింది. దక్షిణాఫ్రికాతో సిరీస్‌ ఓటమి తర్వాత ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి వెళ్లే అవకాశాన్ని ఆస్ట్రేలియా కూడా చేజార్చుకుంది. ఐసీసీ ప్రపంచ కప్ 2023కి ముందు నెంబర్ వన్ ర్యాంక్‌కు చేరేందుకు ఏ జట్టు ఎంత అవకాశం ఉందంటే..? 

ఆస్ట్రేలియా

==> ప్రస్తుత ర్యాంక్: 3
==> ప్రస్తుత రేటింగ్ పాయింట్లు: 113
==> రాబోయే మ్యాచ్‌లు: భారత్‌ (సెప్టెంబర్ 22, సెప్టెంబర్ 24, సెప్టెంబర్ 27) 

దక్షిణాఫ్రికాతో సిరీస్ ఓడిపోవడంతో ఆస్ట్రేలియా నంబర్ 1 ర్యాంక్‌ చేజారింది. ప్రపంచకప్‌ ముందు నెం.1 ర్యాంక్‌ చేరుకోవాలంటే.. భారత్‌తో సిరీస్‌ను వైట్‌వాష్ చేయాల్సి ఉంటుంది. రెండు విజయాలు సాధిస్తే.. చివరి వన్డే వరకు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతుంది. 

భారత్
==> ప్రస్తుత ర్యాంక్: 2
==> ప్రస్తుత రేటింగ్: 115
==> రాబోయే మ్యాచ్‌లు: ఆస్ట్రేలియా (సెప్టెంబర్ 22, సెప్టెంబర్ 24, సెప్టెంబర్ 27)

ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగే సిరీస్‌ను భారత్ సొంతం చేసుకుంటే.. వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకుంటుంది. మొదటి వన్డే గెలిస్తేనే ఫస్ట్ ర్యాంక్ భారత్ సొంతమవుతుంది. మొదటి ర్యాంక్ నిలబెట్టుకోవాలంటే సిరీస్‌ను గెలవాల్సి ఉంటుంది.  

పాకిస్థాన్

==> ప్రస్తుత ర్యాంక్: 1
==> ప్రస్తుత రేటింగ్: 115
==> రాబోయే మ్యాచ్‌లు: ప్రపంచ కప్‌కు ముందు మ్యాచ్‌లు లేవు

ఆసియా కప్‌లో సూపర్ ఫోర్ మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో ఓడిపోవడంతో ప్రపంచ కప్ ప్రారంభంలో పాకిస్థాన్ నెం.1 ర్యాంక్‌లో నిలిచే అవకాశాలు భారీగా పడిపోయాయి. ప్రపంచకప్‌లో నెంబర్ వన్ జట్టుగా నిలవాంటే.. భారత్-ఆస్ట్రేలియా టోర్నీపై పాక్ ఆధారపడాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియా 2-1 తేడాతో వన్డే సిరీస్‌ను సొంతం చేసుకుంటే.. పాక్ నెంబర్ వన్ స్థానంలోనే కొనసాగుతుంది. ఆస్ట్రేలియా 3-0 తేడాతో గెలిస్తే.. భారత్ మూడో స్థానానికి పడిపోతుంది. అప్పుడు ఆస్ట్రేలియా, పాకిస్థాన్ తొలి రెండు స్థానాల్లో నిలుస్తాయి. 

Also Read: IND Vs SL Asia Cup 2023: ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు.. నిప్పులు చెరిగిన సిరాజ్.. తోకమూడిచిన శ్రీలంక బ్యాట్స్‌మెన్  

Also Read: Ghaziabad Man Death: షాకింగ్ ఘటన.. ట్రెడ్‌మిల్‌పై రన్నింగ్ చేస్తూ యువకుడు మృతి  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News