మూడో టెస్టు : విజయం దిశగా కోహ్లీసేన అడుగులు

మూడో టెస్టులో శ్రీలంక జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది.

Last Updated : Dec 5, 2017, 06:49 PM IST
మూడో టెస్టు : విజయం దిశగా కోహ్లీసేన అడుగులు

ఢిల్లీ: ఫిరోషా కోట్లా మైదానం వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా ఉంచిన లక్ష్యాన్ని అందుకునే క్రమంలో మూడు కీలక వికెట్లు కోల్పోయి శ్రీలంక పీకల్లోతు కష్టాల్లో పడింది. వివరాల్లోకి వెళ్లినట్లయితే శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్ లో టీమిండియా 246/5 పరుగులకు డిక్లేర్‌ చేసింది.  తొలి ఇన్నింగ్ ఆధిక్యాన్ని కలుపుకొని లంకేయుల ముందు 410 పరుగుల భారీ లక్షాన్ని ఉంచింది.  కాగా ఈ రోజు బర్త్‌డే బాయ్‌ శిఖర్‌ ధావన్‌ 67 పరుగులతో రాణించగా.. కెప్టెన్ విరాట్‌ కోహ్లీ (50), రోహిత్‌ శర్మ (50 ) అర్ధశతకాలు సాధించారు.
 

పీకల్లోతు కష్టాల్లో లంకేయులు..

పిచ్ బౌలర్లకు అనుకూలిస్తున్నందున నాలుగో రోజు ఆట ముగిసేందుకు 31 ఓవర్లు మిగిలున్న సమయంలో కోహ్లీ  ఇన్నింగ్ డిక్లేర్డ్ చేశారు. కాగా భారీ లక్ష్యంతో రెండో  ఇన్నింగ్ ప్రారంభించిన శ్రీలంక నాల్గో రోజు ఆటముగిసే సమయానికి 31 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉంది. శ్రీలంక విజయం కోసం ఇంకా 379 పరుగులు సాధించాల్సి ఉంది. చేతిలో ఇంకా ఏడు వికెట్లు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుత ఫాంను బట్టి చూస్తే లంకేయులు ఈ స్కోర్ ను చేధించడం కష్టసాధ్యమంటున్నారు విశ్లేషకులు. పైగా పిచ్  కూడా బౌలర్లకు అనుకూలంగా మారింది. ఏదైనా అద్భుతం జరిగితే తప్పితే.. టీమిండియా విజయాన్ని ఎవరూ అడ్డులేరనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

 

Trending News