IND vs SA 3rd Test: అభిమానులకు గుడ్‌ న్యూస్‌.. విరాట్ కోహ్లీ వచ్చేస్తున్నాడు! హైదరాబాద్ ఆటగాడికి షాక్!!

టీమిండియా అభిమానులకు ఓ గుడ్‌ న్యూస్‌. దక్షిణాఫ్రికాతో జరుగనున్న మూడో టెస్టులో భారత జట్టు టెస్ట్ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఆడడం దాదాపు ఖాయం అయింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 10, 2022, 08:53 AM IST
  • అభిమానులకు గుడ్‌ న్యూస్‌
  • విరాట్ నెట్ ప్రాక్టీస్‌
  • సిరాజ్‌ స్థానంలో ఇషాంత్‌
 IND vs SA 3rd Test: అభిమానులకు గుడ్‌ న్యూస్‌.. విరాట్ కోహ్లీ వచ్చేస్తున్నాడు! హైదరాబాద్ ఆటగాడికి షాక్!!

Virat Kohli to play third test, Hanuma Vihari out from playing 11: టీమిండియా అభిమానులకు ఓ గుడ్‌ న్యూస్‌. దక్షిణాఫ్రికాతో జరుగనున్న మూడో టెస్టులో (IND vs SA 3rd Test) భారత జట్టు టెస్ట్ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (Virat Kohli) ఆడడం దాదాపు ఖాయం అయింది. వెన్ను నొప్పి కారణంగా రెండో టెస్టుకు దూరమైన కోహ్లీ.. సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్‌లో ఆడనున్నాడని సమాచారం తెలుస్తోంది. ఆదివారం విరాట్ నెట్స్‌లో పాల్గొనడమే (Kohli Net Practice) ఇందుకు కారణం. రికార్డుల రారాజు ఫిట్‌నెస్ సాధించడంతో టీమిండియా అభిమానులు సంబరపడిపోతున్నారు. 

ఆదివారం ప్రాక్టీస్‌ సెషన్లో పాల్గొన్న విరాట్ కోహ్లీ పాల్గొన్నాడు. హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ (Rahul Dravid) టీమిండియా సారథికి పలు సూచనలిస్తూ కనిపించారు. విరాట్ నెట్స్‌లో చాలా కష్టపడ్డాడు. కవర్‌ డ్రైవ్స్‌, ఆఫ్‌ డ్రైవ్‌లతో ఆకట్టుకున్నాడు. కోహ్లీతో పాటుగా టీమిండియా ప్లేయర్స్ (Indian Players) అందరూ శ్రమించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ (BCCI) తన ట్విటర్‌ ఖాతాలో పంచుకుంది. 'మూడో టెస్టుకు టీమిండియా సన్నాహం ప్రారంభమైంది. నిర్ణయాత్మక పోరుకు జట్టు సిద్ధమవుతోంది' అని బీసీసీఐ ట్వీట్‌ చేసింది. 

Also Read: Omicron Variant: ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షల్లో ఒమిక్రాన్ వేరియంట్ గురించి తెలుస్తుందా లేదా

దక్షిణాఫ్రికా, భారత్ జట్ల మధ్య మంగళవారం (జనవరి 11) మూడో టెస్టు ప్రారంభంకానుంది. విరాట్ కోహ్లీ జట్టులోకి రానున్న నేపథ్యంలో  హైదరాబాద్ ప్లేయర్ హనుమ విహారి (Hanuma Vihari) బెంచ్‌కే పరిమితం కానున్నాడు. గత కొన్నిరోజులుగా ఫామ్‌ కోల్పోయి ఇబ్బంది పడుతున్న కెప్టెన్‌  కోహ్లీ మూడో టెస్టులో లయ అందుకుని భారీ స్కోరు చేయాలని భారత అభిమానులు ఆశిస్తున్నారు. 2019 నవంబర్‌లో కోల్‌కతా వేదికగా జరిగిన డే/నైట్‌ టెస్టులో బంగ్లాదేశ్‌పై చివరిసారి సెంచరీ చేశాడు. విరాట్ మూడంకెల స్కోర్ అందుకుని దాదాపుగా రెండేళ్లవుతోంది. ఇక గాయపడిన హైదరాబాద్ పేసర్ మహ్మద్‌ సిరాజ్‌ (Siraj) స్థానంలో సీనియర్‌ పేసర్‌ ఇషాంత్‌ (Ishant) శర్మకు అవకాశం లభించొచ్చు.

మూడో టెస్టులో విజయం సాధించి దక్షిణాఫ్రికా గడ్డపై తొలి సిరీస్‌ని కైవసం చేసుకోవాలని భారత జట్టు తహతహలాడుతోంది. సెంచురియన్‌లో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 113 పరుగుల తేడాతో విజయం సాధించగా.. జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో విజయం సాదించింది. దాంతో మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ని 1-1తో సమం అయింది. రెండు జట్లు ఇప్పుడు సమాన స్థితిలో నిలవడంతో మూడో టెస్టు రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. 

Also Read: Today Horoscope January 10 2022: నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారికి శుభవార్తలు అందుతాయి!!

 

 

 

Trending News