IND vs SA: టీమిండియాదే బ్యాటింగ్.. గెలిస్తేనే రేసులో నిలిచేది! నాలుగోసారి ఓడిన పంత్

India vs South Africa 4th T20I, South Africa opt to bowl. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా  భారత్‌, దక్షిణాఫ్రికా జట్ల మధ్య కాసేపట్లో నాలుగో టీ20 మ్యాచ్‌ ఆరంభం కానుంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 17, 2022, 07:02 PM IST
  • భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య నాలుగో టీ20
  • టీమిండియాదే బ్యాటింగ్
  • నాలుగోసారి ఓడిన పంత్
IND vs SA: టీమిండియాదే బ్యాటింగ్.. గెలిస్తేనే రేసులో నిలిచేది! నాలుగోసారి ఓడిన పంత్

IND vs SA 4th T20I Playing XI is Out: ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా  భారత్‌, దక్షిణాఫ్రికా జట్ల మధ్య కాసేపట్లో నాలుగో టీ20 మ్యాచ్‌ ఆరంభం కానుంది. సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచులో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ తెంబా బావుమా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ప్రొటీస్ టాస్ గెలవడం వరుసగా ఇది నాలుగోసారి. ఈ మ్యాచులో దక్షిణాఫ్రికా మూడు మార్పులతో బరిలోకి దిగుతోంది. 

'నిజం చెప్పాలంటే వికెట్ ఎలా ఉంటుందో మాకు తెలియదు. పెద్దగా గణాంకాలు కూడా మా వద్ద లేవు. అయితే మేము బాగా ఛేజింగ్ చేస్తున్నాము. అందుకే బౌలింగ్ తీసుకున్నా. దాదాపు 180 స్కోర్ వికెట్ అనుకుంటున్నా. గాయాల కారణంగా రబడా, పార్నెల్ తప్పుకున్నారు. హెండ్రిక్స్ కూడా దూరమయ్యాడు. క్వింటన్ డికాక్ కోలుకున్నాడు. మార్కో జాన్సెన్, ఎన్‌గిడి మ్యాచ్ ఆడుతున్నారు' అని తెంబా బవుమా అన్నాడు. ఇది తప్పక గెలవాల్సిన గేమ్ అని, జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదని టీమిండియా కెప్టెన్ రిషబ్ పంత్ చెప్పాడు.

వరుసగా రెండు ఓటముల తర్వాత విశాఖలో గెలిచి టీ20 సిరీస్‌లో నిలిచిన టీమిండియా.. మరో విజయంపై కన్నేసింది. నాలుగో మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను 2-2తో సమం చేయాలని చూస్తోంది. విశాఖలోని ప్రదర్శనను రాజ్‌కోట్‌లోనూ పునరావృతం చేస్తే.. టీమిండియాకు విజయం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. మరోవైపు నాలుగో టీ20 గెలిచి సిరీస్ గెలవాలని దక్షిణాఫ్రికా చూస్తోంది. 

తుది జట్లు:
భారత్
: రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, రిషభ్ పంత్ (కెప్టెన్/కీపర్), హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చహల్, హర్షల్ పటేల్, ఆవేష్ ఖాన్, భువనేశ్వర్ కుమార్. 
దక్షిణాఫ్రికా: క్వింటన్ డికాక్, తెంబా బవుమా (కెప్టెన్), రాస్సీ వాన్ డర్ డస్సెన్, డేవిడ్ మిల్లర్, హెన్రిక్ క్లాసెన్, డ్వెయిన్ ప్రిటోరియస్, కేశవ్ మహరాజ్, మార్కో జాన్సెన్, లుంగి ఎన్గిడి, ఆన్రిచ్ నోర్జ్, తబ్రయిజ్ షంసీ. 

Also Read: Unhealthy Food for Liver: ఇవి తింటే కాలేయ వ్యాధులు తప్పవు.. వీటిని అస్సుల తినకండి..!

Also Read: Revanth Reddy: కాలి నడకన వచ్చి గోడ దూకి బాసర క్యాంపస్‌లోకి ఎంట్రీ.. పోలీసులకు చుక్కలు చూపించిన రేవంత్ రెడ్డి

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News