IND Vs SA 3rd T20 Playing 11 and Toss Updates: సౌతాఫ్రికాతో నేడు కీలక పోరుకు టీమిండియా రెడీ అయింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షార్పణం అవ్వగా.. రెండో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. మూడో మ్యాచ్‌లో గెలిచి సిరీస్ సమం చేయాలని భారత్ భావిస్తోంది. సఫారీ జట్టు గెలిస్తే 2-0 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంటుంది. భారత్ విజయం సాధిస్తే 1-1తో సమం అవుతుంది. గత మ్యాచ్‌లో ఇద్దరు ఓపెనర్లు డకౌట్ అవ్వడం భారత్‌ను దెబ్బతీసింది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా పుంజుకోవాలని టీమిండియా చూస్తోంది. జోహన్నెస్‌బర్గ్‌లోని న్యూ వాండరర్స్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ మొదట బ్యాటింగ్ ఆరంభించనుంది. ఈ మ్యాచ్‌కు టీమిండియా ఎలాంటి మార్పులు చేయలేదు. దక్షిణాఫ్రికా మూడు మార్పులతో బరిలోకి దిగుతోంది.
"మేము మళ్లీ మొదట బౌలింగ్ చేస్తాం. పిచ్ తాజాగా ఉంది. గత మ్యాచ్‌లో ఛేజ్ చేసి విజయం సాధించడం సంతోషంగా ఉంది. అన్ని అంశాలలో మెరుగవ్వాల్సిన అవసరం ఉంది. అన్ని సమస్యలు పరిష్కరించుకునేందుకు ఈ మ్యాచ్ మంచి అవకాశం. భారత్‌పై సిరీస్ గెలవడం అనేది గొప్ప సందర్భం. తుది జట్టులో మూడు మార్పులు చేశాం. కేశవ మహారాజ్ జట్టులోకి వచ్చాడు. నాండ్రే బర్గర్ అరంగేట్రం చేయనున్నాడు. స్టబ్స్ స్థానంలో డోనోవన్ ఫెరీరాను తీసుకున్నాం.." సౌతాఫ్రికా కెప్టెన్ మర్క్రామ్ తెలిపాడు.
"మేము స్కోరు బోర్డుపై మంచి టార్గెట్ ఉంచి.. డిఫెన్స్ చేయాలనుకుంటున్నాము. మంచి ట్రాక్ కనిపిస్తోంది. పిచ్ మారి ఎక్కువగా మారుతుందని అనుకోవడం లేదు. మా ఆటగాళ్లు నిర్భయంగా ఆడాలని అనుకుంటున్నారు. గత మ్యాచ్‌లో కూడా కొన్ని పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. సేమ్ జట్టుతో ఆడుతున్నాం.." అని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు.
తుది జట్లు ఇలా..
భారత్: యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్.
దక్షిణాఫ్రికా: రీజా హెండ్రిక్స్, మాథ్యూ బ్రీట్జ్‌కే, ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, డోనోవన్ ఫెరీరా, ఆండిల్ ఫెహ్లుక్వాయో, కేశవ్ మహరాజ్, లిజాద్ విలియమ్స్, తబ్రైజ్ షమ్సీ, నాండ్రే బర్గర్.
Also Read: Haj Yatra 2024: హజ్ యాత్రికులకు ముఖ్య గమనిక.. రిజిస్ట్రేషన్‌కు ఆ రోజే లాస్ట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి