Harmanpreet Kaur surpasses MS Dhoni in T20I Cricket: ప్రతిష్టాత్మక కామన్వెల్త్ క్రీడల్లో మొదటిసారి ప్రవేశ పెట్టిన మహిళల టీ20 క్రికెట్‌లో భారత్ బోణీ కొట్టింది. ఆదివారం (జులై 31) పాకిస్థాన్‌తో జరిగిన కీలక మ్యాచులో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వర్షం కారణంగా 18 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 99 పరుగులకు ఆలౌటైంది. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్ 11.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసింది. ఈ విజయంతో భారత్ సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. బుధవారం బార్బోడస్‌పై గెలిస్తే సెమీస్ బెర్తు ఖరారు అవుతుంది.
పాకిస్థాన్‌పై విజయం సాధించడంతో భారత మహిళా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధికంగా టీ20 మ్యాచుల్లో విజయాలను నమోదు చేసిన తొలి భారత కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ రికార్డుల్లో నిలిచింది. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్, ఐసీసీ ట్రోఫీల హీరో ఎంఎస్ ధోనీ రికార్డును అధిగమించింది. పాకిస్థాన్‌తో మ్యాచుకు ముందు మహీతో కలిసి సమానంగా ఉన్న హర్మన్‌ప్రీత్.. ఇప్పుడు అతడిని దాటేసింది.
ఇప్పటివరకు అంతర్జాతీయ టీ20ల్లో 71 మ్యాచులకు హర్మన్‌ప్రీత్ కౌర్ భారత మహిళా జట్టు సారథిగా వ్యవహరించింది. ఇందులో భారత్ 42 మ్యాచుల్లో విజయం సాధించగా.. 26 మ్యాచుల్లో ఓడింది. మూడు మ్యాచుల్లో ఫలితం రాలేదు. ఎంఎస్ ధోనీ 72 మ్యాచుల్లో టీమిండియాకు కెప్టెన్సీ చేయగా.. 41 మ్యాచుల్లో గెలిచింది. 28 మ్యాచ్‌ల్లో భారత్ ఓడిపోగా.. ఒక మ్యాచ్ టైగా ముగిసింది. మరో రెండింటి ఫలితం తేలలేదు. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ నాయకత్వంలో భారత్ 50 టీ20 మ్యాచులు ఆడగా.. 30 మ్యాచుల్లో విజయాలు,16 మ్యాచుల్లో ఓటములను ఎదుర్కొంది. ఇక రెండు మ్యాచ్‌లు టైగా.. మరో రెండు మ్యాచ్‌లలో ఫలితం రాలేదు.
Also Read: అషు రెడ్డి అందాల వడ్డన.. జూనియర్ సామ్‌ని అలా చూసి పిచ్చెక్కిపోతున్న ఫాన్స్!
Also Read: Viral Video: చీకటి రోడ్డులో డ్రైవింగ్.. దెయ్యాన్ని చూసి సుస్సు పోసుకున్న యువకులు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook