Virat Kohli hits boundary rope with a bat over field umpire shocking decision: రెండు టెస్ట్ మ్యాచుల సిరీసులో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ (India vs New Zealand) మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఈరోజు మధ్యాహ్నం ప్రారంభం అయిన ఈ మ్యాచులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) డకౌట్ అయ్యాడు. విశ్రాంతి అనంతరం మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టిన కోహ్లీ.. ఎల్బీగా పెవిలియన్ చేరాడు. చతేశ్వర్ పుజారా ఔటైన అనంతరం ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన టీమిండియా కెప్టెన్ కేవలం నాలుగు బంతులు మాత్రమే ఎదుర్కొని ఔట్ అయ్యాడు. ఫీల్డ్ అంపైర్ (Field Umpire ) నితీన్ మీనన్ తప్పిదానికి విరాట్ బలయ్యాడు. బంతి ముందుగా బ్యాట్‌ను తాకినా మూడో అంపైర్.. ఫీల్డ్ అంపైర్ నిర్ణయానికే కట్టుబడ్డాడు. విషయంలోక్ వెళితే...
ఇన్నింగ్స్ 30వ ఓవర్‌ను కివీస్ స్పిన్నర్ ఆజాజ్ పటేల్ (Ajaz Patel) వేశాడు. ఆ ఓవర్లోని చివరి బంతిని విరాట్ కోహ్లీ (Virat Kohli) డిఫెండ్ చేసే ప్రయత్నం చేయగా.. బంతి ముందుగా బ్యాట్, ఆపై ప్యాడ్‌ను తాకింది. దాంతో కివీస్ ఆటగాళ్లు అప్పీల్ చేయగా ఫీల్డ్ అంపైర్ నితీన్ మీనన్ ఔటిచ్చాడు. బంతి ముందుగా బ్యాట్‌కు తాకిందనే నమ్మకంతో కోహ్లీ రివ్యూ కోరాడు. థర్డ్ అంపైర్ వీరేందర్ శర్మ (Virender Sharma) పలు కోణాల్లో పరిశీలించాడు. అయితే బ్యాట్‌ను తాకిన బంతి ఆ తర్వాత ప్యాడ్‌ను తాకినట్లు కనిపించింది. మరో కోణంలో బ్యాట్, ప్యాడ్‌ను ఒకేసారి తాకినట్లు కనిపించింది. దాంతో పలు కోణాల్లో పరిశీలించిన థర్డ్ అంపైర్.. ఫీల్డ్ అంపైర్ నిర్ణయానికే ఓటేశాడు. థర్డ్ అంపైర్ అనూహ్య నిర్ణయంతో టీమిండియా కెప్టెన్ షాక్ అయ్యాడు.
Also Read: Bigg Boss 5: అదిరిపోయే ట్విస్ట్.. హౌస్‌లోకి స్టార్ యాంకర్ రీఎంట్రీ! అసలు కారణం అదేనా?
చాలా రోజుల విశ్రాంతి అనంతరం మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టిన విరాట్ కోహ్లీ.. అంపైర్ తప్పిదం వల్ల ఔట్ కావడంతో ఎంతో నిరాశగా మైదానం నుంచి డగౌట్‌కు బయలుదేరాడు. ఈ క్రమంలో బౌండరీ దగ్గరకు రాగానే ఆవేశంతో తన బ్యాట్‌ను బౌండరీ రోప్‌కు కొట్టాడు. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. మరోవైపు థర్డ్ అంపైర్ అనూహ్య నిర్ణయంతో అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'థర్డ్ అంపైర్ కళ్లు కనబడటం లేదా', 'ఓ జత కళ్లద్దాలు కొనివ్వండి', 'క్రికెట్ చరిత్రలోనే ఇదో అత్యంత చెత్త అంపైరింగ్' నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Ek do ek do UMPIRE KO FEK DO!
Wankhede has gone wild after Kohli has got out 💔💔💔
Watch the entire reaction here...#INDvsNZ pic.twitter.com/8AfEbnnEcD
— Vinesh Prabhu (@vlp1994) December 3, 2021
Also Read: Man Slaps UP Police: ఎస్సై చెంప చెళ్లుమనిపించిన యువకుడు..వీడియో వైరల్
రెండో టెస్టు (Mumbai Test) మ్యాచులో భారత్ 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 160 చేసింది. ప్రస్తుతం మయాంక్ అగర్వాల్ (85), వృద్దిమాన్ సాహా (0) క్రీజులో ఉన్నారు. 27 ఓవర్ల వరకు ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఆడిన భారత్‌కి.. అజాజ్ పటేల్ షాకిచ్చాడు. హాఫ్ సెంచరీ వైపు దూసుకెళుతున్న శుభ్‌మన్ గిల్ (44)ని పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత ఛెతేశ్వర్ పుజారా (0), కెప్టెన్ విరాట్ కోహ్లీ (0)లను కూడా అజాజ్ ఔట్ చేశాడు. కొద్దిసేపు క్రీజులో ఉన్న శ్రేయాస్ అయ్యర్ (18) కూడా నిరాశపరిచాడు. ఇక భారత్ ఆశలు అన్ని ఇప్పుడు మయాంక్‌పైనే ఉన్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook