న్యూజిలాండ్‌పై నేడు జరిగిన 2వ T20 మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 153 పరుగుల స్వల్ప స్కోర్‌తోనే సరిపెట్టుకుంది. అనంతరం కివీస్ జట్టు నిర్దేశించిన 154 పరుగుల విజయ లక్ష్యాన్ని టీమిండియా జట్టు మూడు వికెట్ల నష్టానికి 17.2 ఓవర్లలోనే ఛేధించింది. దీంతో మూడు మ్యాచుల టీ20 సిరీస్‌లో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 ఆధిక్యంతో భారత్ ఈ సిరీస్‌ను సొంతం చేసుకున్నట్టయింది.
WHAT. A. WIN! 👏 👏#TeamIndia secure a 7⃣-wicket victory in the 2nd T20I against New Zealand & take an unassailable lead in the series. 👍 👍 #INDvNZ @Paytm
Scorecard ▶️ https://t.co/9m3WflcL1Y pic.twitter.com/ttqjgFE6mP
— BCCI (@BCCI) November 19, 2021
టీమిండియా విజయంలో బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ, కె.ఎల్. రాహుల్ కీలక పాత్ర పోషించారు. కేఎల్ రాహుల్ 49 బంతుల్లో 65 పరుగులు చేయగా.. రోహిత్ శర్మ 36 బంతుల్లో 55 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఊపుమీదున్న కె.ఎల్. రాహుల్‌ని టిమ్ సౌథీ పెవిలియన్‌కి పంపించాడు.
Also read : నా గుండె ముక్కలైంది': ఏబీడీ రిటైర్మెంట్పై కోహ్లీ భావోద్వేగం
తొలి టీ20 మ్యాచ్‌లో రెచ్చిపోయిన సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్‌లో 2 బంతుల్లో 1 పరుగుతో మాత్రమే సరిపెట్టుకున్నాడు. వెంకటేష్ 11 బంతుల్లో 12 పరుగులు, రిషబ్ పంత్ 6 బంతుల్లో 12 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. మొత్తానికి టీ20 వరల్డ్ కప్ చేజేతుల చేజార్చుకున్న టీమిండియా ఆ వెంటనే కివీస్‌తో జరుగుతున్న ప్రస్తుత టీ20 సిరీస్ మాత్రం కైవసం చేసుకుని కొంత రిలీఫ్‌నిచ్చింది.
Also read : మిస్టర్ 360 షాకింగ్ నిర్ణయం: అన్ని ఫార్మెట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన ఏబీ డివిలియర్స్
Also read : సంచలనం: మహిళతో సెక్స్ చాటింగ్.. ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్సీకి రాజీనామా చేసిన పైన్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook