Virat Kohli: టీమిండియాకు బిగ్‌ షాక్.. ఇంగ్లాండ్‌తో తొలి రెండు టెస్టులకు కోహ్లీ దూరం

Ind Vs Eng Test Series 2024: ఇంగ్లాండ్‌తో జరిగే తొలి రెండు టెస్టులకు టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాలతో తప్పుకుంటున్నట్లు బీసీసీఐకి కోహ్లీ రిక్వెస్ట్ పంపించాడు. కోహ్లీ అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న బీసీసీఐ.. కోహ్లీ పర్మిషన్ ఇచ్చింది.   

Written by - Ashok Krindinti | Last Updated : Jan 22, 2024, 05:47 PM IST
Virat Kohli: టీమిండియాకు బిగ్‌ షాక్.. ఇంగ్లాండ్‌తో తొలి రెండు టెస్టులకు కోహ్లీ దూరం

Ind Vs Eng Test Series 2024: ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టుల సిరీస్‌కు టీమిండియా సిద్ధమైంది. హైదరాబాద్ వేదికగా ఈ నెల 25వ తేదీ నుంచి మొదటి టెస్ట్ జరగనుండగా.. రెండో టెస్టు ఫిబ్రవరి 2 నుంచి విశాఖపట్నంలో జరగనుంది. అయితే టెస్ట్ సిరీస్‌ ప్రారంభానికి ముందుకు భారత్‌కు బిగ్‌ షాక్ తగిలింది. వ్యక్తిగత కారణాలతో తొలి రెండు టెస్టుల నుంచి విరాట్ కోహ్లీ వైదొలిగాడు. కోహ్లీ రిక్వెస్ట్ మేరకు కోహ్లీని టీమ్ నుంచి బీసీసీఐ రిలీజ్ చేసింది. "కెప్టెన్ రోహిత్ శర్మ, టీమ్ మేనేజ్‌మెంట్, సెలెక్టర్లతో విరాట్ మాట్లాడాడు. దేశానికి ప్రాతినిధ్యం వహించడం ఎల్లప్పుడూ తన మొదటి ప్రాధాన్యత అని, కొన్ని వ్యక్తిగత పరిస్థితులు కారణంగా తప్పుకుంటున్నాడు.." అని బీసీసీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది. 

విరాట్ కోహ్లీ గోప్యతను గౌరవించాలని.. అతని వ్యక్తిగత కారణాలపై ఊహాగానాలు మానుకోవాలని బీసీసీఐ అభిమానులను కోరింది. టెస్ట్ సిరీస్‌లో భారత జట్టుకు మద్దతు ఇవ్వడంపై దృష్టి పెట్టాలని సూచించింది. కోహ్లీ నిర్ణయాన్ని గౌరవించిన బీసీసీఐ.. స్టార్ బ్యాటర్‌కు మద్దతుగా నిలిచింది. ఇంగ్లాండ్‌పై మంచి రికార్డు ఉన్న కోహ్లీ.. టెస్టు సిరీస్‌కు దూరమవ్వడం టీమిండియాకు ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు. వన్డే వరల్డ్ కప్ ఓటమి తరువాత సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్ ఆడాడు. అఫ్గానిస్థాన్‌తో తొలి టీ20కి దూరమైనా.. ఆ తరువాత చివరి రెండు టీ20లు ఆడాడు.

నాలుగో స్థానంలో కోహ్లీ దూరమవ్వడంతో.. శ్రేయాస్ అయ్యర్ లేదా కేఎల్ రాహుల్‌లో ఒకరు బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందు వచ్చే అవకాశం ఉంది. కేఎస్ భరత్ లేదా ధృవ్ జురెల్‌లో ఒకరిని తుది జట్టులో తీసుకునే ఛాన్స్ ఉంది. కాగా.. విరాట్ కోహ్లీ స్థానంలో రజత్ పాటిదార్‌ను టీమ్‌లోకి ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అహ్మదాబాద్‌లో ఇంగ్లండ్ లయన్స్‌పై జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో రజత్ పాటిదార్ శతకం బాదాడు. మరోవైపు ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ టెస్ట్ జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ రంజీ ట్రోఫీ సీజన్‌ను డబుల్ సెంచరీతో ప్రారంభించిన ఛెతేశ్వర్ పుజారా కూడా రీఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్నాడు. 

ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ హ్యారీ బ్రూక్ ఇప్పటికే పర్యటన నుంచి వైదొలగిన విషయం తెలిసిందే. వ్యక్తిగత కారణాల బ్రూక్ ఈ సిరీస్‌లో ఆడడం లేదు. ఇక WTC పాయింట్ల పట్టికలో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా మొదటిస్థానంలో ఉండగా.. భారత్ రెండో స్థానంలో ఉంది.

Also Read: Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిరంలో ఈ విశేషాలు తెలుసా..

Also Read: Suryavanshi Thakur: ఐదు వందల ఏళ్ల తర్వాత నెరవేరిన శపథం.. పట్టువదలని సూర్యవంశి ఠాకూర్‌ వంశీయులు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News