Ind vs Eng Semi Final Match: ఇండియా vs ఇంగ్లండ్ మ్యాచ్ ఓటమికి కారణాలు ఇవేనా ?

Ind vs Eng Semi Final Match: ఇంతకీ ఇంగ్లండ్ చేతిలో ఓటమికి కారణాలు ఏంటి ? ఓవర్ కాన్ఫిడెన్స్ దెబ్బతీసిందా ? అనుకున్న ప్రణాళికలను ఇంప్లిమెంట్ చేయడంలో రోహిత్ శర్మ ఫెయిల్ అయ్యాడా ? ఇవేవీ కాకుండా ఆటగాళ్ల వైఫల్యమే భారత్ కప్ గెలవాలన్న ఆశల్ని అడియాశలు చేసిందా ? రండి అసలేం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Written by - Pavan | Last Updated : Nov 11, 2022, 05:22 AM IST
Ind vs Eng Semi Final Match: ఇండియా vs ఇంగ్లండ్ మ్యాచ్ ఓటమికి కారణాలు ఇవేనా ?

Ind vs Eng Semi Final Match: ఇండియా vs ఇంగ్లండ్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపైనే ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఇంగ్లండ్ జట్టుపై గెలిచి టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టుతో టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకుంటుందని టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ ఆశిస్తే.. అనుకున్నదొక్కటి, అయ్యిందొక్కటి.. బోల్తా కొట్టిందిలే బుల్‌బుల్ పిట్టా అనే పాట చందంగా తయారైంది మన టీమిండియా పరిస్థితి. 

ఇంతకీ ఇంగ్లండ్ చేతిలో ఓటమికి కారణాలు ఏంటి ? ఓవర్ కాన్ఫిడెన్స్ దెబ్బతీసిందా ? అనుకున్న ప్రణాళికలను ఇంప్లిమెంట్ చేయడంలో రోహిత్ శర్మ ఫెయిల్ అయ్యాడా ? ఇవేవీ కాకుండా ఆటగాళ్ల వైఫల్యమే భారత్ కప్ గెలవాలన్న ఆశల్ని అడియాశలు చేసిందా ? రండి అసలేం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

పవర్ ప్లేలో పనిచేయని మంత్రం
మ్యాచ్‌పై పట్టు సాధించాలంటే పవర్ ప్లేలో మంచి స్కోర్ రాబట్టాలి అంటుంటారు. కానీ రోహిత్ శర్మ విషయంలో అది జరగలేదు. రోహిత్ శర్మ తొలి 28 బంతుల్లో నాలుగు బౌండరీలు కలిపి కేవలం 27 పరుగులు మాత్రమే రాబట్టాడు. అంటే రోహిత్ శర్మ తన ప్లాన్‌ని తానే ఇంప్లిమెంట్ చేయలేకపోయాడా అనే సందేహం కలుగుతోంది.

తాను కోరుకున్న టీమ్ తనకు ఉంది. అయినా రోహిత్ శర్మ సక్సెస్ కాలేకపోయాడు. ఆటగాళ్ల ఎంపిక మొదలు బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు వంటివి టీమిండియా ఓటమికి కారణాలు అయ్యాయా అని అనిపించకమానదు. 

ఒత్తిడిలో ఉన్నప్పుడు ఆడలేకపోతున్న కేఎల్ రాహుల్
కేఎల్ రాహుల్ మొదటి మూడు మ్యాచుల్లోనూ కేవలం సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాడు. ఆ మూడు మ్యాచులు కూడా టీమిండియాపై ఒత్తిడి ఉన్నవే. ఆ తర్వాత రెండు బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీలు కొట్టాడు. ఆ రెండూ కూడా ఒత్తిడి లేని మ్యాచులే. మళ్లీ ఇప్పుడిలా గెలిసి తీరాల్సిన మ్యాచుల్లోనూ కేఎల్ రాహుల్ 5 బంతుల్లో 5 పరుగులకే వెనుదిరిగాడు. అంటే కేఎల్ రాహుల్ ఒత్తిడిలో రాణించలేకపోతున్నాడన్నమాట.

ఈ టీ20 వరల్డ్ కప్‌లో యుజ్వేంద్ర చాహల్‌ని ( Yuzvendra Chahal ) కాదని వికెట్స్ తీసుకోలేకపోతున్న రవిచంద్ర అశ్విన్‌కి చోటివ్వడం మరో తప్పిదంగా క్రికెట్ పండితులు విశ్లేషిస్తున్నారు. రవిచంద్ర అశ్విన్ రెడ్ బాల్ క్రికెట్‌లో సరైన ఆటగాడే అయినప్పటికీ 2016-17 లోనే మిడిల్ ఓవర్స్‌లో ఇండియా వికెట్స్ తీయలేకపోతోందనే కారణంతో అతడిని పక్కనపెట్టేశారనే సంగతి గుర్తుంచుకోవాలని ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు.

బాల్ స్వింగ్ అయితేనే భువనేశ్వర్ కుమార్.. లేదంటే..
బాల్ స్వింగ్ అయితే భువి అంతటి ఆటగాడు లేడు కానీ అలా జరగలేదంటే భువి నుంచి ఏం ఆశించలేం. ఇంగ్లండ్‌పై మ్యాచులోనూ ఇదే జరిగింది.

Also Read : Rohit Sharma: ఇంగ్లండ్ చేతిలో భారత్ ఘోర పరాభవం.. ఓటమికి రోహిత్ శర్మ చెప్పిన కారణం ఏంటో తెలుసా?

Also Read : Rohit Sharma in Ind vs Eng: రోహిత్ శర్మకు, హార్థిక్ పాండ్యకు కోపం తెప్పించిన షమీ.. వీడియో వైరల్

Also Read : Rohit Sharma Crying: బోరున ఏడ్చేసిన రోహిత్ శర్మ.. వైరల్ అవుతున్న వీడియోస్, ఫొటోస్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News