Joe Root Record: విరాట్ కోహ్లీ, స్టీవ్‌ స్మిత్‌లను దాటేసిన జో రూట్.. సచిన్‌ రికార్డు కష్టమేమీ కాదు!

Joe Root Surpass Virat Kohli and Steve Smith in Test Format. ప్రస్తుత టెస్టు క్రికెట్‌లో అత్యధిక శతకాలు బాదిన ఆటగాడిగా ఇంగ్లండ్‌ స్టార్‌ బ్యాటర్‌ జో రూట్ నిలిచాడు.  

Written by - P Sampath Kumar | Last Updated : Jul 6, 2022, 09:19 PM IST
  • భీకర ఫామ్‌లో జో రూట్
  • విరాట్ కోహ్లీని దాటేసిన జో రూట్
  • సచిన్‌ రికార్డు కష్టమేమీ కాదు
Joe Root Record: విరాట్ కోహ్లీ, స్టీవ్‌ స్మిత్‌లను దాటేసిన జో రూట్.. సచిన్‌ రికార్డు కష్టమేమీ కాదు!

Joe Root Surpass Virat Kohli and Steve Smith in Test Format: గత కొంతకాలంగా ఇంగ్లండ్‌ స్టార్‌ బ్యాటర్‌ జో రూట్ భీకర ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ప్రతి టెస్ట్ సిరీస్‌లోనూ పరుగుల వరద పారిస్తున్నాడు. ఈ క్రమంలోనే జూన్ ఆరంభంలో లార్డ్స్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో 10,000 పరుగల మైలురాయిని అందుకున్నాడు. దాంతో టెస్టు క్రికెట్‌ చరిత్రలో 10 వేల పరుగులు చేసిన 14వ ఆటగాడిగా రూట్‌ రికార్డుల్లోకి ఎక్కాడు. టెస్ట్ ఫార్మాట్‌లో 10 వేల పరుగులు పూర్తి చేసిన రెండో ఇంగ్లండ్ ఆటగాడిగానూ నిలిచాడు. తాజాగా రూట్ మరో రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. 

భారత్‌తో జరిగిన ఐదో టెస్టులో జో రూట్ (142 నాటౌట్‌; 173 బంతుల్లో 19x4, 1x6) సెంచరీ చేశాడు. 378 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భారత బౌలర్లపై విరుచుకుపడుతూ పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో శతకం బాదిన రూట్.. తన కెరీర్‌లో 28వ సెంచరీని పూర్తి చేశాడు. దీంతో ప్రస్తుత టెస్టు క్రికెట్‌లో అత్యధిక శతకాలు బాదిన ఆటగాడిగా రూట్ నిలిచాడు. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (27), ఆస్ట్రేలియా మాజీ సారథి స్టీవ్‌ స్మిత్‌ (27)లను రూట్ అధిగమించాడు. 

విరాట్‌ కోహ్లీ చివరగా 2019 నవంబర్‌లో సెంచరీ చేశాడు. స్టీవ్‌ స్మిత్ 2021 జనవరిలో శతకం బాదాడు. ఆ సమయంలో జో రూట్‌ సెంచరీల సంఖ్య 22. ఈ క్యాలెండర్‌ ఇయర్‌లో 6 సెంచరీలు బాదిన రూట్.. వారిద్దరినీ అధిగమించి ప్రపంచ నంబర్‌వన్‌ బ్యాటర్‌ అయ్యాడు. రూట్‌ ఇదే జోరు కొనసాగిస్తే.. టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెట్ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్ రికార్డు బద్దలయ్యేటట్లు ఉంది. సచిన్‌ టెస్టుల్లో 15921 రన్స్ చేయగా.. రూట్ ఇప్పటివరకు 10285 పరుగులు చేశాడు. సచిన్‌ కన్నా  6వేల పరుగులు తక్కువ ఉన్న రూట్ వయస్సు 31 ఏళ్లే. జేమ్స్‌ అండర్సన్‌ మాదిరి 40 ఏళ్ల వరకు క్రికెట్‌ ఆడితే.. సచిన్‌ అత్యధిక పరుగుల రికార్డును అధిగమించే అవకాశం ఉంది. 

Also Read: Shikhar Dhawan Captain: టీమిండియా కెప్టెన్‌గా శిఖర్ ధావన్.. వైస్‌ కెప్టెన్‌గా..!

Also Read: ENG vs IND Playing XI: రోహిత్ ఇన్.. బుమ్రా ఔట్! తొలి టీ20 ఆడే భారత జట్టు ఇదే

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News