IND vs AUS: తొలి టెస్టులో ఆస్ట్రేలియా దారుణ ఓటమి.. రంగంలోకి కొత్త స్పిన్నర్‌! డేవిడ్ వార్నర్‌పై వేటు

Matt Kuhnemann added Australian Test squad for India Tour 2023. స్పిన్నర్‌ మిచెల్ స్వెప్సన్‌ స్థానంలో ఎడమ చేతి వాటం మాట్‌ కుహ్నెమాన్‌ను ఆస్ట్రేలియా జట్టులోకి తీసుకుంది.  

Written by - P Sampath Kumar | Last Updated : Feb 12, 2023, 06:11 PM IST
  • తొలి టెస్టులో ఆస్ట్రేలియా దారుణ ఓటమి
  • రంగంలోకి కొత్త స్పిన్నర్‌
  • డేవిడ్ వార్నర్‌పై వేటు
IND vs AUS: తొలి టెస్టులో ఆస్ట్రేలియా దారుణ ఓటమి.. రంగంలోకి కొత్త స్పిన్నర్‌! డేవిడ్ వార్నర్‌పై వేటు

Matthew Kuhnemann replaces Mitchell Swepson for Delhi Test in Border Gavaskar Trophy 2023: బోర్డర్‌-గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా నాగ్‌పుర్‌లో ముగిసిన మొదటి టెస్టులో ఆస్ట్రేలియా దారుణ ఓటమిని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. మూడో రోజు ఆటలో 223 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆసీస్ 91కే ఆలౌట్‌ ఆలౌట్ అయి ఇన్నింగ్స్‌ 132 పరుగుల తేడాతో ఓడిపోయింది. స్పిన్‌కు అనుకూలంగా ఉన్న నాగ్‌పుర్‌ పిచ్‌పై పరుగులు చేయడానికి ఆసీస్ బ్యాటర్లు ఆపసోపాలు పడ్డారు. తొలి ఇన్నింగ్స్‌లో మార్నస్ లబుషెన్ చేసిన 49 పరుగులే టాప్ స్కోర్ అంటే ఎలా ఆడారో అర్ధం చేసుకోవచ్చు. రెండు టాప్ జట్లు ఆడుతున్న టెస్ట్ మూడో రోజే ముగియడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. 

ఫిబ్రవరి 17 నుంచి భారత్‌, ఆస్ట్రేలియా మధ్య ఢిల్లీ వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది. తొలి టెస్ట్ ఫలితం పునరావృతం కాకుండా ఉండేందుకు రంగంలోకి దిగింది. నాగ్‌పుర్‌ టెస్టులో స్పిన్నర్లు కీలకపాత్ర పోషించి.. ఏకంగా 23 వికెట్లు పడగొట్టారు. దాంతో మిగిలిన మ్యాచ్‌ల్లోనూ స్పిన్నర్లు  మారనున్నారనే అంచనాకి ఆసీస్‌ వచ్చేసింది. దాంతో కొత్త స్పిన్నర్‌ని రంగంలోకి దింపుతోంది. తొలి టెస్టు కోసం తుది జట్టులో చోటు దక్కని స్పిన్నర్‌ మిచెల్ స్వెప్సన్‌ స్థానంలో ఎడమ చేతి వాటం మాట్‌ కుహ్నెమాన్‌ను జట్టులోకి తీసుకుంది.

'తొలి టెస్టు తుది జట్టులో మిచెల్ స్వెప్సన్‌కు చోటు దక్కలేదు. స్వెప్సన్‌ భార్య ప్రస్తుతం ప్రెగ్నెంట్‌. ప్రసవం సమయంలో తన భార్య ఉండేందుకు బ్రిస్బేన్‌కు తిరిగి వెళ్లనున్నాడు. స్వెప్సన్‌ స్థానంలో మాట్‌ కుహ్నెమాన్ జట్టులోకి వచ్చాడు. ఢిల్లీ పిచ్‌ స్పిన్‌కు అనుకూలంగా ఉంటే.. నాథన్‌ లైయన్‌, టాడ్‌ మార్ఫీతో కలిసి కుహ్నెమాన్ స్పిన్ బాధ్యతలు పంచుకుంటాడు' అని క్రికెట్ ఆస్ట్రేలియా ఓ ప్రకటనలో తెలిపింది. 

మాట్‌ కుహ్నెమాన్ ఇప్పటివరకు ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఆడలేదు. 4 వన్డేలు, 36 టీ20లు ఆడాడు. కుహ్నెమాన్ నాలుగు వన్డేల్లో 6, 36 టీ20ల్లో 27 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు తొలి టెస్టులో విఫలమైన స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌పై వేటు పడే అవకాశం ఉంది. వార్నర్ స్థానంలో ఫామ్‌లో ఉన్న మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్‌ని రెండో టెస్టుకు తుది జట్టులోకి వస్తాడని సమాచారం. ఫిబ్రవరి 17 నుంచి రెండో టెస్టు ప్రారంభం కానుంది.

Also Read: Meta Layoffs 2023: మెటాలో మరోసారి ఉద్యోగుల తొలగింపు.. ఇప్పటికే 11 వేల మంది!  

Also Read: Upcoming Cars In India: భారత మార్కెట్‌లోని 3 పురాతన కార్లు.. బుకింగ్ కూడా మొదలైంది! ఎలక్ట్రిక్ వెర్షన్‌లో అంబాసిడర్‌  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News