IND vs AUS 3rd Test Playing 11: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తొలి టెస్ట్‌లో అద్భుత విజయం సాధించిన భారత్.. రెండో టెస్ట్‌లో చేతులెత్తేసింది. పింక్ బాల్ టెస్ట్‌లో బ్యాటింగ్, బౌలింగ్ రంగాల్లో విఫలమైంది. అడిలైడ్ ఓవల్ వేదికగా జరిగిన డే/నైట్ మ్యాచ్‌లో పది వికెట్ల తేడాతో ఘోర ఓటమిని మూటగట్టుకుంది. భారత బ్యాట్స్‌మెన్ విఫలమైన పిచ్‌పై ఆసీస్ బ్యాట్స్‌మెన్ చెలరేగి బ్యాటింగ్ చేయగా.. ఆసీస్ బౌలర్లతో పోలిస్తే మన బౌలింగ్‌లో పదును తగ్గింది. రెండో టెస్ట్ ఓటమిని మార్చిపోయి మూడో టెస్ట్‌కు సిద్ధమవుతోంది రోహిత్ సేన. ఈ మ్యాచ్‌కు ఎలాంటి మార్పులు చేయనుందని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. స్టార్ పేసర్ మహ్మద్ షమీ మూడో టెస్ట్‌కు అందుబాటులోకి వచ్చేది అనుమానంగా మారింది. అదేవిధంగా కొందరూ సీనియర్లకు విశ్రాంతినిచ్చి కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాలని డిమాండ్స్ వస్తున్నాయి.
Also Read: K Kavitha: తుపాకీ గురిపెట్టిన రేవంత్ రెడ్డి తీరుతో తెలంగాణ తల్లి కన్నీళ్లు
తొలి టెస్ట్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన భారత్.. అద్భుతంగా ఆడి 295 పరుగుల తేడాతో ఆసీస్‌ను చిత్తు చేసింది. రెండో టెస్ట్‌కు కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ తుది జట్టులోకి వచ్చినా.. బ్యాటింగ్‌లో అందరూ విఫలమయ్యారు. కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి సీనియర్లు సైతం ఆసీస్ పేసర్ల ముందు ఎక్కువసేపు క్రీజ్‌లో నిలవలేకపోయారు. పేసర్ నితీశ్ రాణా కూడా పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. ఇక గాయం నుంచి పూర్తిగా కోలుకున్న మహ్మద్ షమీ.. త్వరలోనే జట్టుతో చేరనున్నాడు. అయితే నాలుగో టెస్ట్ నుంచి రంగంలోకి దిగే అవకాశం ఉంది. గతేడాది వన్డే వరల్డ్ కప్ ఫైనల్ తరువాత జట్టుకు దూరమైన షమీ.. మళ్లీ కోలుకుని మైదానంలోకి అడుగుపెట్టాడు. షమీ తుదిజట్టులోకి వస్తే.. హర్షిత్ రాణా బెంచ్‌కే పరిమితమవుతాడు.
మూడో టెస్ట్‌కు అశ్విన్ ప్లేస్‌లో వాషింగ్టన్ సుందర్‌ను తీసుకుంటారని చెబుతున్నారు. అశ్విన్ బౌలింగ్‌లో ఒక వికెట్ తీయగా.. బ్యాటింగ్‌లో పెద్దగా రాణించలేదు. దీంతో వాషింగ్టన్ సుందర్ తుది జట్టులో ఉంటే.. బ్యాటింగ్ డెప్త్ మరింత పెరుగుతుందని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. బుమ్రా, సిరాజ్ రెండో టెస్ట్‌లో చెరో నాలుగు వికెట్లు తీశారు.
ఇక కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్‌పై ఆందోళన నెలకొంది. కెప్టెన్‌గా, బ్యాట్స్‌మెన్‌గా విఫలం కావడంతో అన్నింటా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. రోహిత్‌ను తుది జట్టు నుంచి తప్పించాలని డిమాండ్స్ కూడా వినిపిస్తున్నాయి. హిట్‌మ్యాన్ రిటైర్మెంట్ ప్రకటించి యువకులకు అవకాశం ఇవ్వాలని మరికొందరు సూచిస్తున్నారు. ఈ సిరీస్ తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. డిసెంబర్ 14వ తేదీ నుంచి మూడో టెస్ట్ ప్రారంభంకానుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.