Steve Smith: టెస్టుల్లో తొలి క్రికెటర్‌గా స్టీవ్ స్మిత్ అరుదైన ఘనత

Ind vs Aus 3rd Test: Steve Smith: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ అరుదైన ఘనత సాధించాడు. టీమిండియాతో సిడ్నీ వేడికగా జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో స్టీవ్ స్మిత్ హాఫ్ సెంచరీ చేశాడు. ఓ టెస్టులో సెంచరీ, హాఫ్ సెంచరీ నమోదు చేసిన అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

Last Updated : Jan 10, 2021, 11:32 AM IST
  • ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ అరుదైన ఘనత
  • దక్షిణాఫ్రికా ఆటగాడు జాక్ కలిస్ రికార్డును అధిగమించిన స్టీవ్ స్మిత్
  • మూడో టెస్టులో రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేస్తున్న భారత క్రికెట్ జట్టు
Steve Smith: టెస్టుల్లో తొలి క్రికెటర్‌గా స్టీవ్ స్మిత్ అరుదైన ఘనత

Ind vs Aus 3rd Test: Steve Smith: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ అరుదైన ఘనత సాధించాడు. టీమిండియాతో సిడ్నీ వేడికగా జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో స్టీవ్ స్మిత్ హాఫ్ సెంచరీ చేశాడు. తద్వారా ఓ టెస్టులో సెంచరీ, హాఫ్ సెంచరీ నమోదు చేసిన అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. స్టీవ్ స్మిత్ తన టెస్టు కెరీర్‌లో ఈ ఫీట్ 10వ పర్యాయం సాధించాడు.

గతంలో ఈ రికార్డు దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ జాక్ కలిస్ పేరిట ఉండేది. కలిస్ 9 టెస్టుల్లో ఓ ఇన్నింగ్స్‌లో సెంచరీ, మరో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ చేశాడు. తాజాగా జరుగుతున్న టెస్టులో స్టీవ్ స్మిత్ 10వ సారి ఈ ఫీట్ నమోదు చేయడంతో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. అనంతరం టీమిండియా(Team India) ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్(81: 167 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్) ఔటయ్యాడు.
Also Read: Ravindra Jadeja ఫీల్డింగ్ మాయాజాలం.. స్టీవ్ స్మిత్ షాక్.. వీడియో వైరల్

ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అలెస్టర్ కుక్ మూడో స్థానంలో ఉన్నాడు. 8 పర్యాయాలు ఈ ఫీట్ సాధించగా, క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్, కుమార సంగక్కర, విరాట్ కోహ్లీలు ఏడు టెస్టుల్లో ఈ ఘనత సాధించారు. వీరంతా నాలుగో స్థానంలో ఉన్నారు. టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో స్టీవ్ స్మిత్(Steve Smith) 9వ స్థానంలో నిలిచాడు.

రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 312/6 వద్ద డిక్లేర్ చేసింది. టీమిండియా బౌలర్ జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్‌లో కామెరూన్ గ్రీన్ (84: 132 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లు) ఔట్ కావడంతో ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసినట్లు కెప్టెన్ టీమ్ పైన్ నిర్ణయం తీసుకున్నాడు. నేడు నాలుగో రోజు మ్యాచ్ చివరి సెషన్ టీమిండియా బ్యాటింగ్ చేస్తోంది. 

Also Read: Elon Musk: ప్రపంచ ధనవంతుడు ఎలాన్ మాస్క్.. 10 ఆసక్తికర విషయాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News