Ravindra Jadeja joins Kapil Dev Elite List: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన రికార్డు నెలకొల్పాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 500 వికెట్లు పడగొట్టాడు. ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో ట్రెవిస్ హెడ్ వికెట్ తీయడం ద్వారా జడేజా ఖాతాలో 500వ అంతర్జాతీయ వికెట్ (టెస్ట్, వన్డే, టీ20) చేరింది. దాంతో బ్యాటుతో 5 వేల పరుగులు, బంతితో 500 వికెట్లు తీసిన రెండో భారత క్రికెటర్‌గా 34 ఏళ్ల జడ్డూ నిలిచాడు. భారత్ నుంచి మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఒక్కడే ఈ ఫీట్ సాధించాడు.
స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా ఆగస్టు 2022 నుంచి ఆటకు దూరంగా ఉన్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023 సిరీస్‌తో ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు తిరిగి వచ్చాడు. బ్యాట్, బంతితో రాణిస్తూ పురాగణంలో అదరగొడుతున్నాడు. భారతదేశం తరఫున తన 63వ టెస్టు ఆడుతున్న జడేజా.. తన మొదటి ఓవర్ నాలుగో బంతికి ఆస్ట్రేలియా ఓపెనింగ్ బ్యాటర్ ట్రావిస్ హెడ్‌ని అవుట్ చేసి అంతర్జాతీయ క్రికెట్‌లో 500 వికెట్లు పూర్తి చేశాడు. దాంతో 5000 పరుగులు మరియు 500 వికెట్లు జడేజా ఖాతాలో చేరాయి.
భారత్ తరపున మొత్తం 63 టెస్టులు, 171 వన్డేలు మరియు 64 టీ2Iలు ఆడాడు. ఇప్పటివరకు వరుసగా 2623, 2447 మరియు 457 పరుగులు చేశాడు. జడేజా బౌలింగ్ గణాంకాల విషయానికొస్తే టెస్టులలో 260, వన్డేలలో 189 మరియు టీ20లలో 51 వికెట్లను పడగొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 5 వేల పరుగులు, 500 వికెట్లు తీసిన 11వ ప్లేయర్ జడేజా. ఇమ్రాన్ ఖాన్, ఇయాన్ బోథమ్, వసీం అక్రమ్, కపిల్ దేవ్, షాన్ పోలాక్, చమిందా వాస్, జాక్వస్ కలీస్, డానియల్ విటోరి, షాహిద్ ఆఫ్రిదీ, షకీబ్ అల్ హసన్ ఈ ఫీట్ సాధించారు.
ఇండోర్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకే ఆలౌట్ అయింది. ఆసీస్ స్పిన్నర్లు మాథ్యూ కుహ్నెమన్, నాథన్ లియోన్ ధాటికి టీమిండియా బ్యాటర్లు చేతులెత్తేశారు. పిచ్‌పై బంతి టర్న్ అవుతుండడంతో టీమిండియా వరుసగా వికెట్స్ కోల్పయింది. విరాట్ కోహ్లీ చేసిన 22 పరుగులే టాప్ స్కోర్. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన ఆసీస్ రెండు వికెట్ల నష్టానికి 11 పరుగులు చేసింది.
Also Read: ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ ఛార్జింగ్ స్మార్ట్‌ఫోన్.. కేవలం 10 నిమిషాల్లోనే బ్యాటరీ ఫుల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.