Kohli-Rohit: కోహ్లీ, రోహిత్ బ్రోమాన్స్.. అచ్చు చిన్న పిల్లల్లా సెలబ్రేషన్స్! వైరల్ అవుతున్న వీడియో

Rohit Sharma, Virat Kohli bromance video goes viral in IND vs AUS 3rd T20I. మూడో టీ20 మ్యాచ్‌లో భారత్ విజయం అనంతరం విరాట్ కోహ్లీ, రోహిత్‌ శర్మ పట్టరాని సంతోషంలో మునిగిపోయారు.    

Written by - P Sampath Kumar | Last Updated : Sep 26, 2022, 11:36 AM IST
  • కోహ్లీ, రోహిత్ బ్రోమాన్స్
  • అచ్చు చిన్న పిల్లల్లా సెలబ్రేషన్స్
  • వైరల్ అవుతున్న వీడియో
Kohli-Rohit: కోహ్లీ, రోహిత్ బ్రోమాన్స్.. అచ్చు చిన్న పిల్లల్లా సెలబ్రేషన్స్! వైరల్ అవుతున్న వీడియో

Rohit Sharma, Virat Kohli bromance video goes viral after India win Hyderabad T20: టీ20 ప్రపంచకప్‌ 2022కు ముందు భారత్ అదరగొట్టింది. పటిష్ట ఆస్ట్రేలియాతో మూడు టీ20ల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. ఆదివారం రాత్రి ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో జరిగిన సిరీస్ డిసైడర్, మూడో టీ20 మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచులో ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 7 వికెట్లకు 186 పరుగులు చేసింది. కామెరూన్‌ గ్రీన్‌ (52; 21 బంతుల్లో 7×4, 3×6), టిమ్‌ డేవిడ్‌ (54; 27 బంతుల్లో 2×4, 4×6) హాఫ్ సెంచరీలు చేశారు. ఛేదనలో భారత్ 4 వికెట్లు కోల్పోయి మరో బంతి మిగిలి ఉండగా లక్ష్యాన్ని చేరుకుంది. సూర్యకుమార్‌ యాదవ్ (69; 36 బంతుల్లో 5×4, 5×6), విరాట్ కోహ్లీ (63; 48 బంతుల్లో 3×4, 4×6) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. 

మొదటి రెండు మ్యాచ్‌లలో విఫలమయిన విరాట్‌ కోహ్లీ.. తనకు అచ్చొచ్చిన ఉప్పల్‌ స్టేడియంలో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. సూర్యకుమార్‌ యాదవ్‌తో కలిసి జట్టును విజయం వైపు తీసుకెళ్లాడు. చివరి ఓవర్‌ రెండో బంతికి డేనియల్‌ సామ్స్‌ బౌలింగ్‌లో క్యాచ్‌ ఔట్ అయ్యాడు. క్రీజును వీడిన కోహ్లీ డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్తుండగా.. అక్కడే ఉన్న కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అతడిని భుజం తట్టి మరీ అభినందించాడు. బ్యాట్, పాడ్స్ విప్పని కోహ్లీ.. రోహిత్ పక్కనే మెట్లపై కూర్చున్నాడు. ఇద్దరు కలిసి అక్కడి నుంచే మ్యాచ్ వీక్షించారు. 

ఆఖరి ఓవర్‌ ఐదో బంతికి హార్దిక్‌ పాండ్యా ఫోర్‌ బాదడంతో టీమిండియా విజయం సాధించింది. దాంతో మెట్లపై కూర్చున్న విరాట్ కోహ్లీ, రోహిత్‌ శర్మ పట్టరాని సంతోషంలో మునిగిపోయారు. రోహిత్‌ను దగ్గరకు లాక్కొని ఆలింగనం చేసుకున్న కోహ్లీ.. హిట్ మ్యాన్ వీపును తట్టి తన ఆనందం వ్యక్తం చేశాడు. ఆపై రోహిత్ కూడా కోహ్లీని గట్టిగా పట్టుకుని ఆనందంలో మునిగిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇది చూసిన ఫాన్స్ తెగ మురిసిపోతున్నారు.

Also Read: IND vs AUS: రామ్ చరణ్ ఇంట్లో టీమిండియా స్టార్ ప్లేయర్స్ సందడి.. హార్దిక్, సూర్య సహా

Also Read: Shardiya Navratri 2022: నవరాత్రులలో అమ్మవారి దగ్గర ఉండే ఈ గోధుమ విత్తనాల ప్రత్యేకత తెలుసా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News