Sunil Narine named captain of Abu Dhabi Knight Riders in in ILT20 League: యూఏఈ ఇంటర్నేషనల్ టీ20 లీగ్ (ILT20 League) తొలి సీజన్ ఆరంభానికి ముందు ఐపీఎల్ ప్రాంచైజీ కోల్‌కతా నైట్‌రైడర్స్ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. అబుదాబి నైట్‌రైడర్స్ కెప్టెన్‌గా వెస్టిండీస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్‌ను నియమించారు. 34 ఏళ్ల నరైన్ సుదీర్ఘ కాలం పాటుగా కోల్‌కతా తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే. జనవరి 13 నుంచి యూఏఈ టీ20 లీగ్ ప్రారంభం అవుతుంది. అబుదాబి నైట్‌రైడర్స్ ప్రాంఛైజీని కోల్‌కతా నైట్‌రైడర్స్ మేనేజ్మెంట్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
400 పైగా టీ20 మ్యాచ్‌లు ఆడిన అనుభవం సునీల్ నరైన్‌కు ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ అతడి బలం. ముఖ్యంగా మిస్టరీ స్పిన్నర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. గత కొన్ని సీజన్‌ల నుంచి ఐపీఎల్ టీమ్ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో కొనసాగుతున్నాడు కాబట్టే.. యాజమాన్యం అతడిపై నమ్మకం పెట్టుకుంది. 2012 మరియు 2022 మధ్య ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కోల్‌కతా ఫ్రాంచైజీ తరఫున 148 మ్యాచ్‌లు ఆడాడు. 5/19 అత్యుత్తమ గణాంకాలతో 152 వికెట్లు తీశాడు.
'అబుదాబి నైట్‌రైడర్స్ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించడానికి నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. ఇది కొత్త సవాలు. ఎందుకంటే ఇప్పుడు నేను నా బ్యాటింగ్, నా నాలుగు ఓవర్లపై దృష్టి పెట్టడం కంటే.. మొత్తం జట్టు పనితీరు గురించి ఆలోచించాల్సి ఉంటుంది. నాకు నైట్‌రైడర్స్ గ్రూపుతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. చాలా ప్రాంఛైజీ లీగ్‌ల్లో రైడర్స్‌కు సంబంధించిన జట్లు ఉన్నాయి. ప్రతీ చోటా నేను భాగం కావడం సంతోషంగా ఉంది. యూఏఈలో నేను చాలా క్రికెట్ ఆడాను. అక్కడి పరిస్థితులు నాకు బాగా అలవాటు. జట్టును విజయ పథంలో నడిపించడానికి ప్రయత్నిస్తా' అని సునీల్ నరైన్ తెలిపాడు.
𝐂𝐀𝐏𝐓𝐀𝐈𝐍 𝐀𝐋𝐄𝐑𝐓 ⚠️
Presenting the 𝘒𝘯𝘪𝘨𝘩𝘵-𝘪𝘯-𝘤𝘩𝘢𝘳𝘨𝘦 at @ADKRiders! 👊🇦🇪#AbuDhabiKnightRiders #ILT20 @ILT20Official #ALeagueApart pic.twitter.com/T9qxhEH7lD
— Abu Dhabi Knight Riders (@ADKRiders) December 14, 2022
యూఏఈ ఇంటర్నేషనల్ టీ20 లీగ్ వచ్చే ఏడాది జనవరి 13న యూఏఈలో ప్రారంభమవుతుంది. ఈ టోర్నమెంట్ ప్రారంభ ఎడిషన్‌లో ఆరు జట్లు పోటీపడతాయి. అందులో అబుదాబి నైట్‌రైడర్స్ ఒకటి. అబుదాబి నైట్‌రైడర్స్ జట్టులో సునీల్ నరైన్‌తో పాటు ఆండ్రీ రస్సెల్, రేమాన్ రీఫర్, అకేల్ హొస్సేన్, కెన్నార్ లూయిస్, రవి రాంపాల్ వంటి విండీస్ స్టార్ ఆటగాళ్లు ఉన్నారు.
Also Read: Best Electric Bikes: రూ.100కే 400 కిలోమీటర్ల ప్రయాణం.. రూ.999కే ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను బుక్ చేసుకోండి!
లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.