World Test Championship: టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసు.. మరింత చేరువలో భారత్.. లెక్కలు ఇవే..

ICC World Test Championship 2023: సౌతాఫ్రికా, ఆసీస్ జట్ల మధ్య జరిగిన చివరి టెస్ట్ డ్రాగా ముగిసింది. టెస్ట్ సిరీస్‌ను కంగారుల జట్టు 2-0 తేడాతో కైవసం చేసుకుంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తరువాత  డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరే జట్లు ఏవో తేలిపోనుంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 8, 2023, 04:12 PM IST
World Test Championship: టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసు.. మరింత చేరువలో భారత్.. లెక్కలు ఇవే..

ICC World Test Championship 2023: ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ చేరేందుకు భారత్‌కు మార్గం సులువైంది. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టెస్టుల సిరీస్ ఆస్ట్రేలియా 2-0తో గెలిచింది. దీంతో ఆస్ట్రేలియా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరుకోవడం దాదాపు ఖరార కాగా.. అదే సమయంలో టీమిండియా కూడా లాభపడింది. ఇప్పుడు భారత్, ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ జరిగే అవకాశాలు పెరిగాయి. ఇక ఇటీవలె పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఎలాంటి ఫలితం లేకుండా డ్రాగా ముగియగా.. ఈ రెండు జట్లు డబ్యూటీసీ ఫైనల్ రేసు నుంచి తప్పుకున్నాయి. ప్రస్తుతం ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్ చేరే రేసులో ఆస్ట్రేలియా, భారత్‌ జట్లు ముందంజలో ఉన్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అత్యధిక విజయాలతో 75.56 శాతం పర్సంటేజ్ పాయింట్లతో ఆసీస్ అగ్రస్థానంలో ఉంది. ఆ తరువాత టీమిండియా 58.93 పర్సంటేజ్ పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. శ్రీలంక 53.33, దక్షిణాఫ్రికా 48.72 పర్సంటేజ్ పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. సాంకేతికంగా నాలుగు జట్ల మధ్యే డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు ఉంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తరువాత ఫైనల్‌ చేరే జట్లు ఏవో తేలిపోనుంది. 

78.57 శాతంతో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉండగా.. 58.93 శాతంతో భారత్ రెండో స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా ఇప్పటి వరకు 14 టెస్టులు ఆడగా, మరో 5 ఆడాల్సి ఉంది. ప్రస్తుతం మెల్‌బోర్న్‌లో సిడ్నీలో దక్షిణాఫ్రికాతో నాలుగు టెస్టుల సిరీస్‌ను ఆడాల్సి ఉంది. భారత్ 14 టెస్టులు ఆడగా.. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ఇంకా పెండింగ్‌లో ఉంది. మొదటి టెస్ట్ ఛాంపియన్‌ షిప్‌ ఫైనల్లో భారత్‌పై కివీస్ విజయం సాధించి టోర్నీని గెలుచుకుంది.

దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి టెస్ట్‌ను 3-0 తేడాతో గెలిచి ఉంటే ఆసీస్ నేరుగా ఫైనల్‌కు చేరేంది. ఇప్పుడు బోర్డర్ గావాస్కర్ ట్రోఫీలో భారత్‌తో ఒక్క మ్యాచ్‌ అయినా డ్రా చేసుకోవాలి. అప్పుడు కనీసంగా 61.40 పర్సెంటేజ్ పాయింట్లతో డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంటుంది. ఈ సిరీస్‌ను టీమిండియా 3-1 తేడాతో గెలుపొందితే.. 61.92 పీసీటీతో ఫైనల్‌కు చేరుకుంటుంది. ఒక వేళ 2-2తో డ్రా అయితే భారత్‌ ఖాతాలో 56.4 శాతం పాయింట్లు ఉంటాయి. కానీ కివీస్ చేతిలో  శ్రీలంక ఓడిపోవాలి. ఇతర జట్ల కంటే ఆసీస్, భారత్ జట్లు మెరుగైన స్థితిలో ఉన్నాయి.

Also Read: Bandi Sanjay: దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మొరిగినట్లుంది కాంగ్రెస్ వ్యవహారం.. బండి సంజయ్ కౌంటర్  

Also Read: Sania Mirza: రిటైర్మెంట్‌పై సానియా మీర్జా ప్రకటన.. లాస్ట్ మ్యాచ్ ఎప్పుడంటే..?  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News