Ind vs Aus 2003 and 2023: 2003 ప్రపంచకప్, 2023 ప్రపంచకప్ మధ్య సామీప్యతలు, మరి కప్ మనదేనా

Ind vs Aus 2003 and 2023: ఐసీసీ ప్రపంచకప్ 2023 తుది సమరానికి మరి కొద్దిగంటలే మిగిలింది. మరి కొన్ని గంటల్లో టీమ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో వివిధ రకాల సమీకరణాలు వెలుగుచూస్తున్నాయి. ఆ వివరాలు మనం తెలుసుకుందాం,..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 18, 2023, 04:39 PM IST
Ind vs Aus 2003 and 2023: 2003 ప్రపంచకప్, 2023 ప్రపంచకప్ మధ్య సామీప్యతలు, మరి కప్ మనదేనా

Ind vs Aus 2003 and 2023: వరుస విజయాలతో ఫైనల్స్‌లో దూసుకొచ్చిన టీమ్ ఇండియాపైనే ఇప్పుడు అందరి కళ్లున్నాయి. క్రికెట్ ప్రపంచం టైటిల్ హాట్ ఫేవరైట్‌గా ఇండియాను పరిగణిస్తోంది. దీనికి చాలా కారణాలున్నాయంటున్నారు. అన్నింటికంటే ప్రధానమైంది 2003 వర్సెస్ 2023 కు చాలా సామీప్యత కన్పిస్తోందట. 

ప్రపంచకప్ 2023 టీమ్ ఇండియా కచ్చితంగా సాధిస్తుందని చాలామంది విశ్లేషించుకుంటున్నారు. ఈ ప్రపంచకప్‌లో ఇండియా ప్రదర్శన చూసినవాళ్లెవరైనా ఇదే అభిప్రాయానికొస్తారు. లీగ్ దశలో మొత్తం 9 మ్యాచ్‌లు గెలిచి నాకౌట్ సెమీస్‌లో న్యూజిలాండ్‌పై గెలిచి ఫైనల్స్ వరకూ చేరిన ఇండియా ప్రస్థానంలో అటు బ్యాటర్లు, ఇటు బౌలర్లు రాణిస్తున్న తీరు చూస్తుంటే ఎవరికీ అందులో సందేహం కలగదు. ఎందుకంటే టీమ్ ఇండియా ఈ ప్రపంచకప్‌లో అంత అద్భుతమైన ఫామ్‌లో ఉంది. అందుకే ఇండియాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. అదే సమయంలో మరి కొన్ని సమీకరణాలు కూడా ఉన్నాయంటున్నారు కొందరు విశ్లేషకులు.

సరిగ్గా 20 ఏళ్ల క్రితం 2003లో ప్రపంచకప్‌లో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా పరిస్థితి, ఇప్పటి పరిస్థితి పోల్చి చూసుకుంటే అప్పుడు ఆస్ట్రేలియా ఉన్న స్థితిలో ఇప్పుడు ఇండియా ఉన్నందున కచ్చితంగా కప్ మనదే అంటున్నారు. 

2003 ప్రపంచకప్ ప్రారంభమయ్యాక రెండవ మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఆస్ట్రేలియా చేతిలో ఘోరంగా ఓడిపోయింది. ఆ తరువాత వరుస విజయాలతో దూసుకొచ్చింది. ఇప్పుడు ఆస్ట్రేలియా కూడా ఇండియాతో సహా తొలి రెండు మ్యాచ్‌లు ఓడిపోయి మిగిలిన మ్యాచ్‌లలో పుంజుకుని ఫైనల్స్ వరకూ చేరింది. 

నాడు 2003లో ఆస్ట్రేలియా ఒక్క పరాజయం లేకుండా అన్ని విజయాలు సాధిస్తూ ఫైనల్స్‌కు చేరి మూడోసారి ప్రపంచకప్ సాధించింది. అప్పుడు ఆస్ట్రేలియా ప్రత్యర్ధి ఇండియానే. ఇప్పుడు ఇండియా ఒక్క పరాజయం లేకుండా అన్నింట్లో గెలుస్తూ ఫైనల్స్‌కు చేరింది. ఇప్పుుడు ప్రపంచకప్ గెలిస్తే ఇండియాకు కూడా మూడవ కప్ అవుతుంది. ఇప్పుడు ఇండియా ప్రత్యర్ధి ఆస్ట్రేలియా.

అంటే అప్పుడు ఆస్ట్రేలియా ఉన్న స్థితిలో ఇప్పుడు ఇండియా ఉంది. ఇప్పుడు ఆస్ట్రేలియా ఉన్న స్థితిలో అప్పుడు ఇండియా ఉంది. రెండింటి మధ్య విరామం సరిగ్గా 20 ఏళ్లు. అందుకే ఈసారి కప్ ఇండియాదే అంటున్నారు. 

Also read: World Cup 2023 Final: ఆస్ట్రేలియాతో తుది సమరం అంత ఈజీ కాదు, జాగ్రత్త అంటున్న మాజీ క్రికెటర్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News