New Zealand women won by 68 runs after India All out for 198: మహిళా వన్డే ప్రపంచకప్ 2022లోని తొలి మ్యాచులో పాకిస్తాన్ జట్టుపై భారీ విజయాన్ని అందుకున్న భారత్.. రెండో వన్డేలో న్యూజిలాండ్ చేతిలో దారుణ ఓటమిని ఎదుర్కొంది. కివీస్ నిర్ధేశించిన 261 పరుగుల లక్ష్య ఛేదనలో మిథాలీ సేన 46.4 ఓవర్లలో 198 రన్స్‌కు ఆలౌట్ అయింది. దాంతో 62 పరుగుల తేడాతో న్యూజిలాండ్ గెలుపొందింది. స్టార్ బ్యాటర్ హర్మన్‌ప్రీత్ కౌర్ (71) హాఫ్ సెంచరీతో పోరాడినా.. టీమిండియాకు ఓటమి తప్పలేదు. కివీస్ బౌలర్లలో లీ తహుహు, అమెలీయా కీర్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. ఇప్పటికే బంగ్లాదేశ్‌పై విజయం అందుకున్న కివీస్.. టీమిండియాపై కూడా గెలిచి మెగా టోర్నీలో రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది.
261 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన 6 పరుగులకే ఔట్ అయింది. ఆపై దీప్తి శర్మ కూడా (5) సింగల్ డిజిట్‌కే పెవిలియన్ చేరింది. ఈ సమయంలో యాస్తిక భాటియా (28), మిథాలీ రాజ్ (31) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే కివీస్ బౌలర్ల ధాటికి భారత మహిళలు క్రీజులో నిలవలేకపోయారు. భాటియా, మిథాలీ అనంతరం హర్మన్‌ప్రీత్ పోరాడినా.. ఆమెకు సంహరించే వారు కరువయ్యారు. దాంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు. స్నేహ్ రాణా 18, పూజా వస్త్రాకర్ (6), జులన్ గోస్వామి (15), మేఘ్న సింగ్ (12) పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో లీ తహుహు 3, అమెలీయా కీర్ 3 వికెట్లు పడగొట్టారు.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ తొమ్మిది వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే కివీస్ జట్టుకు షాక్ తగిలింది. ఓపెనర్ సుజీ బేట్స్ (5) రనౌట్ అయింది. ఆపై కెప్టెన్ సోఫీ డివైన్ (35), అమెలియా కెర్ జట్టును ఆదుకున్నారు. స్ట్రైక్ రొటేట్ చేస్తూ పరుగులు చేశారు. ధాటిగా అదే క్రమంలో డివైన్ క్యాచ్ ఔట్ అయింది. ఈ సమయమ్లో అమీ సత్తర్‌వైట్, అమెలియా మంచి భాగస్వామ్యం నెలకొల్పడంతో కివీస్ స్కోర్ 120 చేరుకుంది.
A solid all-round performance gives New Zealand their second victory in #CWC22 🎉 pic.twitter.com/wpYNsxIOWA
— ICC (@ICC) March 10, 2022
హాఫ్ సెంచరీ చేసిన అమెలియా పెవిలియన్ చేరినా.. మ్యాడీ గ్రీన్ అండతో సత్తర్‌వైట్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపింది. ఈ క్రమంలోనే సత్తర్‌వైట్ అర్ధ శతకం చేసింది. ఈ జోడి నిష్క్రమణ అనంతరం కెటీ మార్టిన్ (41) పరుగులు చేయడంతో కివీస్ భారీ స్కోర్ చేసింది. భారత పేసర్ పూజా వస్త్రాకర్ తన కోటా పది ఓవర్లలో 4 వికెట్లు పడగొట్టి 34 పరుగులు ఇచ్చింది. రాజేశ్వరీ గ్రైక్వాడ్ 2, దీప్తి శర్మ , గోస్వామి చెరో వికెట్ పడగొట్టారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook