India vs West Indies: ప్రపంచకప్ లో భారత్ జోరు.. వెస్టిండీస్‌ పై ఘన విజయం

India vs West Indies: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. వెస్టిండీపై 155 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 12, 2022, 02:06 PM IST
  • వెస్టిండీస్‌పై భారత్‌ ఘన విజయం
  • ప్రపంచకప్‌లో రెండో గెలుపు
  • సెంచరీలతో కదం తొక్కిన స్మృతి, హర్మన్ ప్రీత్
India vs West Indies: ప్రపంచకప్ లో భారత్ జోరు.. వెస్టిండీస్‌ పై ఘన విజయం

India vs West Indies: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌ (ICC Women's World Cup 2022)లో భారత్ జట్టు (India Women) తన రెండో విజయాన్ని నమోదు చేసింది.  వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. బ్యాటింగ్ , బౌలింగ్ లో అద్భుతంగా రాణించిన మిథాలీ సేన..కరీబియన్ జట్టుపై (West Indies Women) సునాయసంగా గెలుపొందారు. 318 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించలేక విండీస్ జట్టు కేవలం 162 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత జట్టు 155 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. 

తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా..50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 317 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన (123; 119 బంతుల్లో 13x4, 2x6), మిడిల్‌ ఆర్డర్‌ బ్యాటర్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (109; 107 బంతుల్లో 10x4, 2x6) శతకాలతో అదరగొట్టారు. యాస్టికా బాటియా 31 పరుగులతో పర్వాలేదనిపించినా... మిగతావారు పెద్దగా రాణించలేదు. అనంతరం ఛేదనకు బరిలోకి దిగింది కరీబియన్ జట్టు.

ఆ జట్టు ఓపెనర్లు డియాండ్రా డాటిన్‌ (62; 46 బంతుల్లో 10x4, 1x6), హేలీ మ్యాథ్యూస్‌ (43; 36 బంతుల్లో 6x4) ధాటిగా ఆడటంతో..కేవలం విండీస్ 12 ఓవర్లకే 100 పరుగులు సాధించింది.  వీరిద్ధరి జోడిని స్నేహ్ రాణా విడదీసింది. అనంతరం టీమిండియా బౌలర్ల రెచ్చిపోయారు. ఒకరి తర్వాత ఒకరిని పెవిలియన్ బాట పట్టించారు. భారత బౌలర్లలో స్నేహ్‌రాణా 3, మేఘ్నా సింగ్‌ రెండు వికెట్లు తీశారు. 

Also Read: NZ vs IND: హర్మన్‌ప్రీత్‌ పోరాడినా.. ప్రపంచకప్‌లో టీమిండియాకు తప్పని ఓటమి!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News