Namibia beat Sri Lanka by 55 runs in T20 WC 2022: టీ20 ప్రపంచకప్ 2022 నేడు ఆరంభం కాగా.. తొలి మ్యాచ్‌లోనే సంచలనం నమోదైంది. రౌండ్-1లో భాగంగా ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో ఆసియా కప్ 2022 ఛాంపియన్ శ్రీలంకకు పసికూన నమీబియా భారీ షాకిచ్చింది. గీలాంగ్ వేదికగా ముగిసిన ఈ మ్యాచ్‌లో 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 108 పరుగులకే ఆలౌట్ అయింది. దాంతో నమీబియా 55 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. నమీబియా బౌలర్లలో స్కోల్ట్జ్, షికోంగో, ఫ్రైలింక్, వైస్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. కెప్టెన్ దాసున్ షనక చేసిన 29 పరుగులే లంక జట్టులో టాప్ స్కోర్.
ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. నమీబియాకు శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు మైఖేల్ వాన్ లింగేన్ (3), దివాన్ లా కాక్ (9) త్వరగానే పెవిలియన్ చేరారు. ఈ సమయంలో ఈటన్ (20), బార్డ్ (26), ఎరాస్మస్ (20) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే లంక బౌలర్ల దాటికి ఈ ముగ్గురుతో సహా వైస్ (0) పెవిలియన్ చేరడంతో.. 15 ఓవర్లలోపే 95 పరుగులకే ఆరు వికెట్లను కోల్పోయిన నమీబియా కష్టాల్లో పడింది.
కీలక వికెట్లు కోల్పోవడంతో నమీబియా 120 పరుగులు చేయడం కూడా కష్టమే అని అందరూ అనుకున్నారు. అయితే అందరి అంచనాలను ఆల్‌రౌండర్లు ఫ్రైలింక్ (44; 28 బంతుల్లో 4 ఫోర్లు), స్మిత్ (31; 16 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులు) పటాపంచలు చేశారు. స్మిత్ లంక బౌలర్లపై విరుచుకుపడుతూ వేగంగా పరుగులు చేశాడు. ఇద్దరు కలిసి 32 బంతుల్లో 70 పరుగులు చేయడంతో నమీబియా కోలుకుంది. చివరికి 20 ఓవర్లలో 163 పరుగులు చేసింది. లంక బౌలర్లలో మధుషాన్ 2 వికెట్స్ తీశాడు.
నమీబియా నిర్దేశించిన 164 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంకకు శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు నిస్సాంక (9), కుశాల్ మెండిస్ (8) విఫలమయ్యారు. కెప్టెన్ దాసున్ శనక (29), భానుక రాజపక్స (20) కాసేపు పోరాడినా.. ఫలితం లేకుండా పోయింది. నమీబియా బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టడంతో లంక కోలుకోలేకేపోయింది. లంక ఏ దశలోనూ లక్ష్యం వైపు సాగలేదు. ఆసియా కప్ 2022లో విజేత అయిన లంక ఇలా దారుణంగా ఓడిపోవడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.
Also Read: జీవితంలో ఈ చిన్న పొరపాట్లు అస్సలు చేయకూడదు.. చేశావో జీవితాంతం శనితో సావాసమే!
Also Read: Balakrishna - Rashmika : బాలయ్యను పడగొట్టేసిన రష్మిక మందన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook