ICC T20 Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌ల్లో టీమిండియా స్టార్ ప్లేయర్ హార్దిక్ పాండ్యా దూకుడు కనబరిచాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో ఏకంగా ఎనిమిది స్థానాలు ఎగబాకి ఐదో స్థానానికి చేరాడు. దీంతో తన కెరీర్‌లోనే అత్యుత్తమ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఇటీవల జరిగిన ఇంగ్లండ్, విండీస్, ఐర్లాండ్ టీ20 సిరీస్‌ల్లోనూ హార్దిక్ పాండ్యా అలరించారు. ఆసియా కప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆకట్టుకున్నాడు. దీంతో అత్యుత్తమ స్థానానికి చేరాడు.
మొత్తంగా ఆల్‌రౌండర్ల జాబితాలో అప్ఘనిస్థాన్ ప్లేయర్ మహ్మద్ నబీ 257 పాయింట్లతో తొలి స్థానంలో నిలిచాడు. 245 పాయింట్లతో బంగ్లాదేశ్ ఆటగాడు షకీబ్ అల్ హసన్ రెండో స్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్ ప్లేయర్ మెయిన్ అలీ 221 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. 183 పాయింట్లతో ఆస్ట్రేలియా ఆటగాడు గ్లెన్ మాక్స్‌వెల్ నాలుగో స్థానంలో, 167 పాయింట్లతో హార్దిక్ పాండ్యా ఐదో స్థానంలో నిలిచాడు. దుబాయ్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ప్లేయర్ హార్దిక్ పాండ్యా రాణించాడు.
బ్యాట్‌తో, బాల్‌తో అదరగొట్టాడు. 4 ఓవర్లు బౌలింగ్ వేసి..25 పరుగులు ఇచ్చి మూడు కీలక వికెట్లు తీశాడు. ఇటు బ్యాటింగ్‌లోనూ అదరహో అనిపించాడు. 17 బంతుల్లో 33 పరుగులు చేశాడు. ఇందులో 4 ఫోర్లు, ఓ సిక్సర్ ఉంది. ఉత్కంఠ మ్యాచ్‌లో సిక్సర్ బాది..మరో రెండు బంతులు ఉండగానే జట్టుకు విజయాన్ని అందించాడు.
Also read:MLC Kavitha: విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి..కవిత ఇంట్లో వినాయక చవితి ఉత్సవాలు..!
Also read:Asia Cup 2022: టీమిండియా తదుపరి కెప్టెన్ హార్దిక్ పాండ్యానే..భారత మాజీ ప్లేయర్ జోస్యం..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి