Ben Stokes on Suryakumar Yadav ahead of IND vs ENG T20 World Cup semifinal: టీ20 ప్రపంచకప్ 2022లో భారత్ విజయాలకు ప్రధాన కారణం ఎవరంటే.. వెంటనే గుర్తొచ్చే పేరు 'సూర్యకుమార్ యాదవ్'. విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్‌ను నిలబెడుతున్నా.. చివరి ఓవర్లలో సూర్య విధ్వసంతో భారత్ భారీ స్కోర్ చేస్తోంది. ఎలాంటి బంతైనా సరే బౌలర్లపై విరుచుకుపడుతూ.. సూర్య ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. సూర్య ఆడే విచిత్ర షాట్లకు ఫాన్స్ మాత్రమే కాదు ప్లేయర్స్, మాజీలు కూడా బిత్తరపోతున్నారు. సూర్యకుమార్ మైదానం నలుమూలలా పరుగులు చేస్తూ 'మిస్టర్ 360' అనే బిరుదు పొందాడు.
దక్షిణాఫ్రికా, జింబాబ్వే మ్యాచుల్లో సూర్యకుమార్ యాదవ్ ఆడిన ఇన్నింగ్స్‌లు టీ20 ప్రపంచకప్ 2022లోనే హైలైట్‌గా నిలిచాయి. సూర్య ఆడిన కొన్ని షాట్లు క్రికెట్‌లో కూడా సరికొత్తగా అనిపించాయి. జింబాబ్వేపై ఆడిన ధనాధన్ ఇన్నింగ్స్‌పై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. సూపర్ 12లో ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచుల్లో సూర్య 225 పరుగులు చేశాడు. సెమీ ఫైనల్‌లో ఇంగ్లండ్‌తో తలపడేందుకు భారత్ సిద్ధమైంది. సెమీ ఫైనల్‌లో కూడా సూర్య చెలరేగాలని భారత్ మేనేజ్మెంట్ కోరుకుంటోంది.
టీమిండియాతో సెమీస్ మ్యాచ్ ముందు ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ మీడియాతో మాట్లాడుతూ... 'టీ20 ప్రపంచకప్ 2022 టైటిల్ గెలవాలంటే ఇంకో రెండు మ్యాచులు గెలవాల్సి ఉంది. కప్ గెలుస్తామనే నమ్మకం ఉంది. బలమైన భారత జట్టుతో గురువారం సెమీస్ ఫైనల్ ఆడాలి. ఈ మ్యాచును మా ప్లేయర్స్ తేలికగా తీసుకోలేరు. భారత జట్టులో ఉన్న ఆటగాళ్లపై ఎక్కువ దృష్టి పెట్టాలి ఉంది. అదే సమయంలో మా అస్రాలను సిద్ధం చేసుకోవాలి' అని అన్నాడు.
'సూర్యకుమార్ యాదవ్ అద్భుతం. అతడు ప్రస్తుతం ఫెంటాస్టిక్ ఫామ్‌లో ఉన్నాడు. సూర్య ఆడే కొన్ని షాట్స్ చూస్తే.. బుర్ర గోక్కోవడం తప్పితే ఏం చెయ్యలేం. అయితే సెమీస్ మ్యాచులో అతన్ని అడ్డుకోవాలి. మాపై విరుచుకుపడి పరుగులు చేయకుండా ఆపుతామని అనుకుంటున్నా. అందుకోసం ప్రత్యేక వ్యూహాలు రచించాల్సి ఉంది. రోహిత్ శర్మ గొప్ప ఆటగాళ్ళలో ఒకడు. అతను ప్రపంచ స్థాయి ఆటగాడు. అతడిని కూడా అంత తేలికగా తీసుకోము' అని బెన్ స్టోక్స్ తెలిపాడు.
Also Read: ఆ ప్లేయర్ లేకుంటే భారత్ 150 పరుగులు కూడా చేయలేదు.. సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు
Also Read: IND vs ENG: డేవిడ్ మలన్ ఔట్.. సరికొత్త అస్త్రాన్ని సిద్ధం చేసిన ఇంగ్లండ్! టీమిండియాకు చుక్కలే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి