Dale Steyn: రిటైర్మెంట్‌పై స్పందించిన స్టార్ పేసర్ డేల్ స్టెయిన్

Dale Steyn Retirement: దక్షిణాఫ్రికా పేసర్ డేల్ స్టెయిన్ తన రిటైర్మెంట్ గురించి వస్తున్న వదంతులపై స్పందించాడు. తాను ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)కు అందుబాటులో ఉండలేనని మాత్రమే చెప్పినట్లు 37 ఏళ్ల స్టార్ పేసర్ డేల్ స్టెయిన్ స్పష్టం చేశాడు.

Last Updated : Jan 3, 2021, 01:02 PM IST
  • తన రిటైర్మెంట్ గురించి వస్తున్న వదంతులపై స్పందించాడు
  • ఐపీఎల్ 2021కు మాత్రమే అందుబాటులో ఉండనని చెప్పాను
  • రిటైర్మెంట్ ప్రకటించలేదని స్పష్టం చేసిన స్టార్ పేసర్ డేల్ స్టెయిన్
Dale Steyn: రిటైర్మెంట్‌పై స్పందించిన స్టార్ పేసర్ డేల్ స్టెయిన్

Dale Steyn Retirement: దక్షిణాఫ్రికా పేసర్ డేల్ స్టెయిన్ తన రిటైర్మెంట్ గురించి వస్తున్న వదంతులపై స్పందించాడు. తాను ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్(Indian Premier League)కు అందుబాటులో ఉండలేనని మాత్రమే చెప్పినట్లు 37 ఏళ్ల స్టార్ పేసర్ డేల్ స్టెయిన్ స్పష్టం చేశాడు. అందరూ అనుకున్నట్లుగా తాను రిటైర్మెంట్ కాలేదని తెలిపాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు అందుబాటులో ఉండనని Dale Steyn స్పష్టం చేశాడు. వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ 2021లో ఆర్సీబీ జట్టుకు తాను దూరంగా ఉండనున్నట్లు తెలిపాడు. ఈ మేరకు అధికారి ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి రిటైర్మెంట్ వదంతులపై వివరణ ఇచ్చాడు.

Also Read: Rohit Sharma: వైస్ కెప్టెన్‌గా ఓపెనర్ రోహిత్ శర్మకు పగ్గాలు

 

 

ఆర్సీబీకి ఆడటం లేదని నిజం, దాంతోపాటు తాను రిటైర్మెంట్ అయ్యానన్నది కేవలం వదంతులు మాత్రమేనని.. ఇతర జట్లకు సైతం తాను ప్రాతినిథ్యం వహించడం లేదని డేల్ స్టెయిన్ క్లారిటీ ఇచ్చాడు. తన పరిస్థితిని అర్థం చేసుకున్న ఆర్సీబీ జట్టుకు సైతం ధన్యవాదాలు తెలిపాడు. గత ఐపీఎల్‌లో ఆర్సీబీ నాలుగో స్థానంలో నిలిచింది.

Also Read: Indian Cricketers Retired In 2020: ఈ ఏడాది రిటైరైన భారత క్రికెటర్లు వీరే

 

కాగా, డేల్ స్టెయిన్ ట్వీట్‌పై ఆర్సీబీ(RCB) మేనేజ్‌మెంట్ స్పందించింది. డేల్ స్టెయిన్ నిన్ను మిస్ అవుతాం. జట్టుకు సేవలు అందించినందుకు ధన్యవాదాలు అని ఆర్సీబీ ట్వీట్ చేసింది. ఐపీఎల్‌లో 95 మ్యాచ్‌‌లాడిన స్టెయిన్ మొత్తం 97 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ 2020లో మూడు మ్యాచ్‌లాడని స్టెయిన్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీశాడు.

Also Read: Ravichandran Ashwin: ప్రపంచ రికార్డు నెలకొల్పిన టీమిండియా బౌలర్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News