ఆల్‌రౌండర్ హార్డిక్ పాండ్యా లైఫ్ జర్నీ..

Last Updated : Aug 22, 2017, 11:41 AM IST
ఆల్‌రౌండర్ హార్డిక్ పాండ్యా లైఫ్ జర్నీ..

టీమిండియా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా. ఇటు బ్యాటింగ్.. ఇటు బౌలింగ్ ..ఫీల్డింగ్ ఇలా అన్ని ఫార్మాట్లలో నిలకడగా రాణిస్తున్న ఏకైక భారత్ క్రికెటర్ హార్ధిక్. వర్థమాన భారత క్రికెటర్లలో  భయంకరమైన షాట్లతో వైరి పక్షంలో గుబులుపుట్టించే ఆటగాడు ఎవరంటే..ఇట్టే వినిపించే పేరు హార్డిక్ పాండ్యా. ఎటాకింగ్‌ శైలిలో కెప్టెన్ కోహ్లీతో పోల్చి చూసే హార్దిక్‌ జీవితం నల్లేరుపై నడకేమీ కాదు. కష్టాలనే నిప్పుల సుడి గుండాలెన్నో దాటి మన ముందుకొచ్చిన అతడి గురించి ప్రత్యేక కథనం.

బ్రేక్ ఫాస్ట్, డిన్నర్ మ్యాగీతోనే...

క్రికెట్ ఆడే తొలి రోజుల్లో పదిరూపాయల మ్యాగీతోనే ఉదయం, రాత్రి సమయంలో కడపు నింపుకునే వాడు హార్దిక్. ఇది హార్ధిక్ కుటుంబ ఆర్ధిక పరిస్థితి. తోటి సహచరులు రుచికరమైన ఆహారం తీసుకుంటే చూస్తు ఉండటం తప్పిన రుచి ఎరగ లేదు. తనకు తాను నియంత్రించుకుంటూ తన లక్ష్యసాధన కోసం నిరంతరం శ్రమించేవాడు. అలాంటి పరిస్థితులే తనను ఇంతటివాణ్ణి చేశాయంటున్నాడు మన హార్ధిక్ ప్యాండ్యా.

క్రికెట్ కిట్ కొనలేని దుస్థితి..

రంజీ మ్యాచులు ఆడే సమయంలో తనకు సొంత కిట్ కూడా ఉండేది కాదు.. బరోడా క్రికెట్‌ సంఘం నుంచి క్రికెట్‌ కిట్లు తీసుకెళ్లేవారు. క్రికెట్ మ్యాచ్ ఆడితే రోజుకు రూ.400 రూపాయలు మాత్రమే. ఐపీఎల్‌లో ఆడేందుకు ఆరేళ్ల  ముందు వరకు అతనిది ఇదే పరిస్థితి. ఐపీఎల్ ఎంపికతో హార్థిక్ దశ మారిపోయింది. ఐపీఎల్ ఎంపిక కావడంతో హార్థిక జీవితం ములుపు తిరిగింది. ఐపీఎల్ ను తానేంటో నిరూపించుకునే వేదికగా మరల్చుకుని ..తన సత్తా ఏపాటిదో బాహ్య ప్రపంచానికి తెలిపాడు హార్ధిక్. హార్ధిక్ ప్రదర్శనతో క్రికెట్ దేవుడు సచిన్ ఫిదా అయ్యాడు. మంచి భవిష్యత్తు ఉందని వెన్ను తట్టి ప్రోత్సహించాడు. సచిన్ ప్రోత్సహంతో ఐపీఎల్ మరింత రెచ్చిపోయి తాను ఎంతటి విలువైన క్రికెటరో బాహ్య ప్రపంచానికి తెలియజేశాడు పాండ్యా. 

కూల్ శిక్షణలో ఎమోషనల్...

హార్థిక పాండ్యా కాస్త ఎమోషనల్ పర్సన్.. సంతోషమైన..కోపమైనా వెంటనే బయటపెడతాడు..ఇండియా ఏ తరఫున ఆడినప్పుడు మిస్టర్ కూల్ ద్రవిడ్ శిక్షణలో తనపై తనకు నియంత్రణ సాధించాడు..ఆటలో వేగంతో పాటు స్థిరత్వాన్ని సాధించాడు. ఆ తర్వాత అందరికీ తెలిసిందే పాండ్యా టీమిండియాకో సెలెక్ట్ అవడం.. నిలకడగా తన సత్తా చాటుతున్న విషయం తెలిసిందే.  హార్ధిక్ పాండ్యా ఇప్పుడు టీమిండియా ఎన్నాళ్లగానో ఎదురుచూస్తున్న విలువైన ఆస్తిగా మారిపోయాడు.

Trending News