Ind Vs SL 1st T20 Highlights: కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఐపీఎల్ 2022లో తన కెప్టెన్సీలో గుజరాత్ టైటాన్స్‌కు టైటిల్ అందించిన పాండ్యా.. అంతర్జాతీయ క్రికెట్‌లోనూ కెప్టెన్‌గా చాలా విజయవంతమవుతున్నారు. ఇప్పటివరకు 6 మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా వ్యవహరించిన పాండ్యా ఒక్క ఓటమిని కూడా ఎదుర్కోలేదు. తాజాగా శ్రీలంకపై మ్యాచ్‌లో అదరగొట్టిన పాండ్యా.. అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. బ్యాటింగ్‌లో 29 పరుగులు చేయడంతోపాటు.. బౌలింగ్‌లో కేవలం 12 పరుగులు మాత్రమే ఇచ్చాడు.
శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఉమ్రాన్ మాలిక్, శివమ్ మావి, హర్షల్ పటేల్‌లకు తొలి ఓవర్ ఇవ్వకుండా హార్దిక్ పాండ్యా మొదటి ఓవర్ స్వయంగా బౌలింగ్ చేశాడు. దీంతో టీ20 ఫార్మాట్‌లో భారత్ తరఫున తొలి ఓవర్ వేసిన తొలి కెప్టెన్‌గా నిలిచాడు. టీ20ల్లో గతంలో కెప్టెన్లుగా వ్యవహరించిన వారు ఎవరూ తొలి ఓవర్ బౌలింగ్ చేయలేదు.
ఇతర ఫార్మాట్లలో తొలి ఓవర్‌లోనే మాజీ వెటరన్‌లు లాలా అమర్‌నాథ్, కపిల్ దేవ్, అనిల్ కుంబ్లేలను సమం చేశాడు. వీరంతా వివిధ ఫార్మాట్లలో కెప్టెన్లుగా వ్యవహరిస్తూ తొలి ఓవర్ వేశారు. గతేడాది ఇంగ్లాండ్ పర్యటనలో టెస్టుకు కెప్టెన్‌గా ఉన్న సమయంలో జస్ప్రీత్ బుమ్రా తొలి ఓవర్ బౌలింగ్ చేశాడు.
హార్దిక్ పాండ్యా టీమిండియా తరఫున మూడు ఫార్మాట్లలో ఆడాడు. 11 టెస్టు మ్యాచ్‌లు ఆడి 532 పరుగులు, 17 వికెట్లు సాధించాడు. 66 వన్డేల్లో 1386 పరుగులు, 63 వికెట్లు సాధించాడు. టీ20 క్రికెట్‌లో 1189 పరుగులు, 62 వికెట్లు తీశాడు. త్వరలోనే టీమిండియాకు టీ20 ఫార్మాట్‌కు పూర్తిస్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
Also Read: AP Govt Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. గ్రామ, వార్డు సచివాలయాల పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
Also Read: 7th pay commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గమనిక.. డీఏ పెంపు ఎప్పుడంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook