Harbhajan Singh Retirement: హర్భజన్ సింగ్ గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

Harbhajan Singh Retirement: అంతర్జాతీయ క్రికెట్ సహా అన్నీ రకాల టోర్నీలకు టీమ్ఇండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ (Harbhajan Singh) రిటైర్మెంట్ ప్రకటించాడు. తన 23 ఏళ్ల క్రికెట్ కెరీర్లో సహకరించిన వారందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశాడు. అయితే ఇన్నాళ్ల పాటు హర్భజన్ సింగ్ (Harbhajan Singh Retires) గురించి తెలియని కొన్ని ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.   

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 24, 2021, 04:06 PM IST
Harbhajan Singh Retirement: హర్భజన్ సింగ్ గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

Harbhajan Singh Retirement: టీమ్ఇండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ (Harbhajan Singh).. క్రికెట్ కు శుక్రవారం (December 24) రిటైర్మెంట్ (Harbhajan Singh Retirement) ప్రకటించారు. ఆఫ్ స్పిన్నర్ గా గుర్తింపు పొందిన హర్భజన్.. అంతర్జాతీయ క్రికెట్ సహా అన్నీ లీగ్స్ కు వీడ్కోలు పలుకుతున్నట్లు సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. క్రికెట్ కు వీడ్కోలు పలుకుతున్న చెప్పిన సందేశంలో భావోద్వేగానికి లోనయ్యాడు హర్భజన్.   

"మంచి రోజులు ముగిశాయి. నా జీవితంలో నాకు అన్నింటిని అందించిన ఆటకు నేడు (December 24) వీడ్కోలు పలుకుతున్నా. ఈ 23 ఏల్ల సుదీర్ఘ ప్రయాణానాన్ని అందంగా, ఎప్పటికీ గుర్తుండిపోయేలా మార్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు" అని టీమ్ఇండియా మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా పలువురు క్రికెటర్లు హర్భజన్ సేవలను కొనియాడుతుండగా.. మరికొంతమంది తన సెకండ్ ఇన్నింగ్స్ కు ఆల్ ది బెస్ట్ చెప్పుకొచ్చారు. 

41 ఏళ్ల వయసులో హర్భజన్ సింగ్ తన ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే టీమ్ఇండియా అత్యుత్తమ స్పిన్నర్లలో తనదైన శైలీతో గుర్తింపు తెచ్చుకున్న హర్భజన్ సింగ్ (Harbhajan Singh Retires) గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని ఆసక్తికర విషయాలు ఉన్నాయి. అవెంటో తెలుసుకుందాం. 

హర్భజన్ గురించి మీకు తెలియని విశేషాలు..

1) హర్భజన్ సింగ్ కు క్రికెట్ లో తొలి గురువు చరణ్ జిత్ సింగ్. ఆరంభంలో ఆయన దగ్గర భజ్జీ బ్యాటర్ గా శిక్షణ తీసుకున్నాడు. కానీ, చరణ్ జిత్ సింగ్ అకాల మరణం తర్వాత.. హర్భజన్ తన కొత్త కోచ్ దేవిందర్ అరోరా దగ్గర స్పిన్ బౌలింగ్ నేర్చుకున్నాడు. అలా ఆఫ్ స్పిన్నర్ గా అవతరించాడు.  

2) భజ్జీకి ఐదుగురు సోదరీమణలు ఉన్నారు. 2000లో తన తండ్రి మరణం తర్వాత.. కుటుంబ పెద్దగా మారి.. వారందరి వివాహాలు దగ్గరుండి జరిపించాడు. 

3) జులై 2న జన్మించిన హర్భజన్ సింగ్.. తన బర్త్ డే డేట్ ను అదృష్ట సంఖ్యగా భావించి తన టీమ్ జెర్సీలపై నంబరు 3ని ఎంచుకున్నాడు. 

4) 2003లో అర్జున అవార్డు.. 2009లో పద్మశ్రీ అవార్డును అందుకున్నాడు హర్భజన్ సింగ్. 

5) హర్భజన్ సింగ్ ముద్దుపేరు 'భజ్జీ'. సహచరుడు నయన్ మోంగియా హర్భజన్ పేరు పలకడం కష్టంగా భావించి.. అతడికి భజ్జీ అనే పేరు పెట్టాడు. అయితే ఆ తర్వాత భజ్జీ అనే పేరు చాలా పాపులర్ అవ్వడం వల్ల.. ఆ పేరుతో 2009లో పేటెంట్ హక్కులను పొందాడు హర్భజన్. ఆ తర్వాత భజ్జీ అనే పేరుతో స్పోర్ట్స్ లైఫ్ స్టైల్ బ్రాండ్ ను స్థాపించాడు. 

6) 2001లో ఆస్ట్రేలియాతో జరిగిన చారిత్రాత్మక సిరీస్ తర్వాత హర్భజన్ సింగ్‌కు 2002లో అప్పటి ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ పంజాబ్ పోలీస్‌లో DSP పదవిని ఆఫర్ చేశారు. ఆసీస్ తో జరిగిన మూడు టెస్టుల్లో ఒక హ్యాట్రిక్ సహా 32 వికెట్లు పడగొట్టాడు. అయితే, క్రికెట్ పై అతడి ఉన్న నిబద్ధత కారణంగా హర్భజన్ ఆ ఆఫర్ ను తిరస్కరించాడు. 

7) 2001 ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్ లో తొలి హ్యాట్రిక్ వికెట్లు సాధించిన భారత బౌలర్ గా హర్భజన్ ఘనత. 

8) టీమ్ఇండియా తరఫున 103 టెస్టుల్లో 417 వికెట్లు పడగొట్టాడు. ఈ మైలురాయిని చేరుకున్న టీమ్ఇండియాకు చెందిన మూడో బౌలర్ సహా అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. 

9) 2010లో టెస్టుల్లో వరుస సెంచరీలు చేసిన 8వ బ్యాటర్ గా భజ్జీ రికార్డు సాధించాడు. ఇండియా వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన టెస్టు సిరీస్ లో ఈ ఘనత సాధించాడు. 

10) హర్భజన్ మూడు సినిమాల్లోనూ ప్రత్యేక పాత్రలు పోషించాడు. ముజ్ సే షాదీ కరోగి (2004), భాజీ ఇన్ ప్రాబ్లమ్ (2013), సెకండ్ హ్యాండ్ హస్బెండ్ (2015) సహా ఫ్రెండ్షిప్ అనే మూవీలో లీడ్ రోల్ పోషించాడు. ఫ్రెండ్షిప్ అనే చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది.   

Also Read: Harbhajan Singh Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన భారత స్పిన్నర్!!

Also Read: Porn Star Offers Footballer: రష్యన్ ఫుట్ బాలర్ కు పోర్న్ స్టార్ సెక్స్ ఆఫర్.. 16 గంటలపాటు ఏకధాటిగా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News