ఆ బౌలర్ ప్రతిభకు గిఫ్ట్‌గా "ముద్దు"

దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ రబాడాకి ఒక అరుదైన గౌరవం దక్కింది.

Last Updated : Jan 11, 2018, 04:53 PM IST
ఆ బౌలర్ ప్రతిభకు గిఫ్ట్‌గా "ముద్దు"

దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ రబాడాకి ఒక అరుదైన గౌరవం దక్కింది. టెస్టు మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మన్‌ను ఔట్ చేయగానే, స్వయంగా దక్షిణాఫ్రికా కెప్టెనే దగ్గరకు వచ్చి బౌలర్ నుదిటిపై నెమ్మదిగా ముద్దు పెట్టాడు.

అంతే కాదు.. తను రబాడాకి ముద్దు పెడుతున్న ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో కూడా పోస్టు చేశాడు. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఆ ఫోటో పోస్టు చేశాక రబాడా ఓ చిలిపి కామెంట్ విసిరాడు.

"అయ్యో.. ఆ ఫోటో వల్ల నా గర్ల్ ఫ్రెండ్ ఫిర్యాదు చేస్తోంది" అని రబాడా రిప్లై ఇవ్వడం వల్ల అదే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో నవ్వులు విరిశాయి. ప్రస్తుతం ప్రపంచంలోనే బాగా ప్రాచుర్యం పొందుతున్న ఫాస్ట్ బౌలర్లలో రబాడా కూడా ఒకరు. కేవలం 22 టెస్టులు ఆడిన ఈ బౌలర్ 102 వికెట్లు తీశాడు. అలాగే 40 వన్డేలు ఆడి 65 వికెట్లు తీశాడు

 

Trending News