Delhi Capitals Captain: ఐపీఎల్ 2023కి రిషబ్ పంత్ దూరం.. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీ రేసులో ఉన్నది వీరే!

Delhi Capitals IPL 2023 Captaincy options after Rishabh Pant  misses out. రిషబ్ పంత్ ఐపీఎల్ 2023 దూరమైతే ఢిల్లీ క్యాపిటల్స్ సారథ్య బాధ్యతలను డేవిడ్ వార్నర్ అందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.   

Written by - P Sampath Kumar | Last Updated : Dec 31, 2022, 07:13 PM IST
  • ఐపీఎల్ 2023కి పంత్ దూరం
  • ఢిల్లీ కెప్టెన్సీ రేసులో ఉన్నది వీరే
  • కెప్టెన్‌గా వార్నర్‌కు ఎక్కువ అవకాశాలు
Delhi Capitals Captain: ఐపీఎల్ 2023కి రిషబ్ పంత్ దూరం.. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీ రేసులో ఉన్నది వీరే!

Delhi Capitals IPL 2023 Captaincy options: టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. కుటంబ సభ్యులతో కలిసి నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనేందుకు ఢిల్లీ నుంచి తన స్వస్థలమైన రూర్కికి వెళ్తూ ప్రమాదం బారిన పడ్డాడు. శుక్రవారం (డిసెంబర్ 30) తెల్లవారుజామున 5.30 గంటలకు పంత్ ప్రయాణిస్తున్న కారు ఢిల్లీ-డెహ్రాడూన్‌ జాతీయ రహదారిలో రూర్కీ నర్సన్ సరిహద్దు హమ్మద్‌పూర్ ఝల్ వద్ద అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. తీవ్రంగా గాయాలు అయిన అతడు ప్రస్తుతం డెహ్రాడూన్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

కారు ప్రమాదంలో తీవ్ర గాయాలవడంతో రిషబ్ పంత్‌ కనీసం ఆరు నెలలు క్రికెట్ ఆటకు దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. గాయాల కారణంగా స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ సిరీస్‌తో పాటు ఐపీఎల్ 2023కి దూరం కానున్నాడు. పంత్‌కు అయిన ఈ అనూహ్య ప్రమాదం ఐపీఎల్ ప్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్‌కు పెద్ద తలనొప్పిగా మారనుంది. ఐపీఎల్ 2023కి పంత్ దూరమవడంతో ఢిల్లీ జట్టు కాంబినేషన్ పూర్తిగా దెబ్బతిననుంది. అంతేకాదు కెప్టెన్సీ కూడా పెద్ద సవాలే. ఢిల్లీ కెప్టెన్సీ రేసులో ముఖ్యంగా నలుగురు ఆటగాళ్లు ఉన్నారు. ఆ నలుగురు ప్లేయర్స్ ఎవరో ఓసారి చూద్దాం. 

రిషబ్ పంత్ ఐపీఎల్ 2023 దూరమైతే ఢిల్లీ క్యాపిటల్స్ సారథ్య బాధ్యతలను డేవిడ్ వార్నర్ అందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా వార్నర్‌కు ఉన్న అనుభవం అతడికి కలిసిరానుంది. పంత్ కారు ప్రమాదం తర్వాత ఢిల్లీ యాజమాన్యం కూడా ఇదే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. విదేశీ ప్లేయర్ కాకుండా.. భారత ఆటగాడినే కెప్టెన్‌గా ఎంపిక చేయాలనుకుంటే మాత్రం పృథ్వీ షా ముందువరసలో ఉన్నాడు. ఐపీఎల్‌లో కెప్టెన్సీ అనుభవం లేకున్నా.. దేశవాళీ క్రికెట్‌లో మాత్రం ఉంది. షా సారథ్యంలోనే ముంబై 2020-21 విజయ్ హజారే ట్రోఫీ గెలిచింది.

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీ రేసులో మనీశ్ పాండే‌ కూడా ఉన్నాడు. కర్ణాటక కెప్టెన్‌గా పాండేకు అనుభవం ఉంది. పాండే సారథ్యంలో కర్ణాటక సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో విజేతగా నిలిచింది. గతంలో డేవిడ్ వార్నర్ గైర్హాజరీలో పాండే సన్‌రైజర్స్‌ హైదరాబాద్ జట్టును కూడా నడిపించాడు. ఇక ఆస్ట్రేలియా స్నియార్ ప్లేయర్ మిచెల్ మార్ష్ కూడా పోటీలో ఉన్నాడు. 2010లో ఆస్ట్రేలియా అండర్ -19 జట్టుకు మార్ష్ సారథిగా చేశాడు.  

Also Read: న్యూ ఇయర్ 2023 ముందుగా మొదలైంది ఈ దేశంలోనే.. ఒకేసారి 43 దేశాల్లో నూతన సంవత్సరం!

Also Read: Virat Kohli Dubai: దుబాయ్ వెకేషన్.. తెగ ఎంజాయ్ చేస్తున్న అనుష్క శర్మ, విరాట్‌ కోహ్లీ! వైరల్ పిక్స్   

లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Trending News