DC vs LSG: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ఢిల్లీకి తప్పని మరో ఓటమి!

DC vs LSG, IPL 2022: Lucknow crush Delhi. ఐపీఎల్ 2022లో భాగంగా ఆదివారం సాయంత్రం వాంఖడే మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో లక్నో సూపర్ జెయింట్స్ అద్భుత విజయం సాధించింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 1, 2022, 08:22 PM IST
  • ఉత్కంఠ పోరులో లక్నో విజయం
  • ఢిల్లీకి తప్పని మరో ఓటమి
  • మోహ్‌సిన్‌ ఖాన్‌ 4 వికెట్లు
DC vs LSG: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ఢిల్లీకి తప్పని మరో ఓటమి!

KL Rahul, Deepak Hooda and Mohsin Khan stars as Lucknow beat Delhi: ఐపీఎల్ 2022లో భాగంగా ఆదివారం సాయంత్రం వాంఖడే మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో లక్నో సూపర్ జెయింట్స్ అద్భుత విజయం సాధించింది. లక్నో నిర్ధేశించిన 196 పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 189 రన్స్ చేసి.. 6 పరుగుల తేడాతో ఓడిపోయింది. రిషబ్ పంత్ (44), అక్షర్ పటేల్ (42 నాటౌట్), మిచెల్ మార్ష్‌ (37), రోవ్‌మన్ పావెల్ (35) రాణించారు. లక్నో బౌలర్‌ మోహ్‌సిన్‌ ఖాన్‌ 4 వికెట్లు పడగొట్టాడు. 

196 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. దుష్మంత్ చమీరా వేసిన రెండో ఓవర్‌లోనే ఓపెనర్ పృథ్వీ షా (5)‌ ఔట్‌ అయ్యాడు. మూడో ఓవర్‌లో మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ (3) కూడా పెవిలియన్ చేరాడు. ఈ సమయంలో ఆయుష్ బదోని పట్టిన క్యాచ్ వివాస్పదంగా మారింది. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ రిషబ్ పంత్.. ధాటిగా ఆడాడు. కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో వరుస బౌండరీలు బాదాడు. అతడికి మిచెల్ మార్ష్ కూడా తోడవ్వడంతో పవర్ ప్లే ముగిసేసరికి ఢిల్లీ 2 వికెట్ల నష్టానికి 66 పరుగులు చేసింది.

కీలక సమయంలో మిచెల్ మార్ష్‌ను కృష్ణప్ప గౌతమ్ ఔట్‌ చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన లలిత్ యాదవ్ (3) కూడా త్వరగానే పెవిలియన్ చేరాడు. రోవ్‌మన్ పొవెల్‌తో కలిసి రిషబ్ పంత్‌ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఇద్దరూ ధాటిగా ఆడటంతో ఢిల్లీ విజయం వైపు దూసుకెళ్లింది. అయితే హాఫ్ సెంచరీకి చేరువైన పంత్‌ను మోహ్‌సిన్ ఔట్ చేశాడు. పొవెల్, శార్దూల్ ఠాకూర్ కూడా ఔటవ్వడంతో మ్యాచ్ లక్నో వైపు మళ్లింది. అక్షర్ పటేల్ చెలరేగినా.. ఆఖరి ఓవర్‌లో ఢిల్లీ విజయానికి 21 పరుగులు అవసరం అయ్యాయి. మొదటి బంతికి కుల్దీప్, చిఎవరి బంతికి అక్షర్ సిక్సర్‌ బాదినా ఫలితం లేకుండా పోయింది. 

ఈ మ్యాచులో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (77), దీపక్ హుడా(52) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ఇన్నింగ్స్ చివర్లో మార్కస్ స్టోయినిస్ (17 నాటౌట్) కీలక పరుగులు చేశాడు. ఢిల్లీ బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఈ విజయంలో లక్నో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది.

Also Read: IPhone 13 Price: ఐఫోన్ 13పై భారీ తగ్గింపు.. రూ. 53,850లకే ఫ్లిప్‌కార్ట్‌లో పొందండిలా!

Also Read: 164, 162 కిమీ వేగంతో బంతులు వేశా.. కానీ బౌలింగ్ మెషీన్ పనిచేయలేదు: సమీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News