RCB vs CSk Match Live: టాస్ గెలిచిన ఆర్సీబీ.. ఇరు జట్ల ప్లేయింగ్ 11 ఇదే..!

RCB vs CSk Match Live: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ హంగామా మెుదలైంది. చెన్నై, బెంగళూరు మధ్య తొలి పోరు మెుదలైంది. టాస్ గెలిచిన ఆర్సీబీ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇరు జట్ల ప్లేయింగ్ 11 ఎలా ఉందంటే?

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 22, 2024, 08:23 PM IST
RCB vs CSk Match Live: టాస్ గెలిచిన ఆర్సీబీ.. ఇరు జట్ల ప్లేయింగ్ 11 ఇదే..!

IPL 2024, csk vs rcb Live Score: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్(ఐపీఎల్) సందడి మెుదలైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ముందుగా టాస్ గెలిచిన ఆర్సీబీ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే టాస్ వేసే సమయంలో రుతురాజ్ తన కెప్టెన్సీ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గత ఐపీఎల్ లోనే మహేంద్రసింగ్ ధోని తన కెప్టెన్సీ గురించి హింట్ ఇచ్చాడని రుతురాజ్ అన్నాడు. ఈ మ్యాచ్ ను స్టార్ స్పోర్ట్స్ 1, జియో సినిమా యాప్‌లో వీక్షించవచ్చు. 

ఆరంభ వేడుకలు అదుర్స్..
ఈ మెగా టోర్నీ ఆరంభ వేడుకలు అద్భుతంగా జరిగాయి. బాలీవుడ్ హీరోలు అక్ష‌య్ కుమార్(Akshay Kumar), టైగ‌ర్ ష్రాఫ్‌లు తమ డ్యాన్స్ లతో అదరగొట్టారు. ‘వార్’ సినిమాలోని ‘జై జై శివ శంక‌ర్’, దేశీ బాయ్స్ సాంగ్స్ కు డ్యాన్స్ చేసి స్డేడియాన్ని హోరెత్తించారు. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహ‌మాన్(AR Rehman), సింగ‌ర్ సోనీ నిగ‌మ్‌లు తమ గానంతో ఆడియెన్స్ ను మంత్రముగ్ధులను చేశారు. రెహ్మాన్ ‘మాతుజే స‌లామ్ పాట పాడుతుంటే స్డేడియం ఉప్పొంగిపోయింది. 

చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్ (సి), రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, డారిల్ మిచెల్, రవీంద్ర జడేజా, సమీర్ రిజ్వీ, ఎంఎస్ ధోని (w), దీపక్ చాహర్, మహేశ్ తీక్షణ, ముస్తాఫిజుర్ రెహమాన్, తుషార్ దేశ్‌పాండే
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): ఫాఫ్ డు ప్లెసిస్(సి), విరాట్ కోహ్లి, రజత్ పటీదార్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్, అనుజ్ రావత్(w), కర్ణ్ శర్మ, అల్జారీ జోసెఫ్, మయాంక్ డాగర్, మహ్మద్ సిరాజ్

Also Read: MS Dhoni: ధోని మరీ ఇంత మంచోడు ఏంటి భయ్యా.. 5 సెకన్ల వీడియోతో అందరి హృదయాలను కొల్లగొట్టిన మిస్టర్ కూల్..

Also Read: IPL History: ఐపీఎల్‌ చరిత్రలో ఇప్పటి వరకు బ్రేక్‌ అవ్వని రికార్డులు ఏంటో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News