Smriti Mandhana: ట్రోఫీ నెగ్గిన వేళ బాయ్‌ఫ్రెండ్‌ను పరిచయం చేసిన ఆర్సీబీ కెప్టెన్‌ స్మృతి మందాన్న

Smriti Mandhana Boyfriend: చిరకాల కల నెరవేరిన వేళ కెప్టెన్‌ తన ప్రియుడితో కలిసి ఉబ్బితబ్బిబైంది. ట్రోఫీ అందుకున్న అనంతరం ప్రియుడితో పంచుకుని సంబరపడిపోయింది రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్‌ స్మృతి మందాన్న. 

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 18, 2024, 08:39 PM IST
Smriti Mandhana: ట్రోఫీ నెగ్గిన వేళ బాయ్‌ఫ్రెండ్‌ను పరిచయం చేసిన ఆర్సీబీ కెప్టెన్‌ స్మృతి మందాన్న

Smriti Mandhana: మహిళల ప్రీమియర్‌ లీగ్‌ ఆసక్తికరంగా సాగిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియంలో ఆదివారం జరిగిన తుది పోరులో ఢిల్లీ క్యాపిటల్‌ను ఓడించి రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ట్రోఫీని కైవసం చేసుకుంది. దీంతో ఆర్సీబీ మహిళా క్రికెటర్‌లంతా సంబరాలు చేసుకున్నారు. ట్రోఫీ అందుకున్న అనంతరం జట్టు కెప్టెన్‌ స్మృతి మందాన్న సందడి చేసింది. ఈ సమయంలో తన ప్రియుడితో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చింది. స్మృతి పక్కన నిల్చున్న ప్రియుడు ఎవరు అనే చర్చ జోరుగా జరిగింది. అతడి పేరు పలాష్‌ ముచ్చల్‌. స్మృతితో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చిన పలాష్‌ కూడా ప్రముఖుడే. 

Also Read: Yusuf Pathan: కాంగ్రెస్ అగ్రనేతను ఢీకొట్టబోతున్న యూసుఫ్‌ పఠాన్.. పొలిటికల్ గ్రౌండ్‌లో సిక్సర్ల వర్షమేనా..!

 

హిందీ సినీ పరిశ్రమలో దర్శకుడిగా పలాష్‌ ముచ్చల్‌ రాణిస్తున్నాడు. కొన్ని వెబ్‌ సిరీస్‌లు కూడా తీశాడని తెలుస్తోంది. అయితే వీరిద్దరూ కొన్నేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. ప్రస్తుతం డేటింగ్‌లో కూడా ఉన్నారని టాక్‌. ఓ ఈవెంట్‌లో కలిసిన సమయంలో పలాష్‌తో పరిచయమై అది ప్రేమగా మారింది. పలాష్‌కు స్మృతి అంటే చాలా ఇష్టం. ఆమె మీద ప్రేమతో చేతిపై పచ్చబొట్టు కూడా వేయించుకున్నాడు. ఎస్‌ఎం18 అని రాయించుకున్నాడు. ఎస్‌ఎం అంటే స్మృతి మందాన్న, 18 అంటే స్మృతి జెర్సీ నంబర్‌.

Also Read:  RCB Vs DC Highlights: జయహో ఆర్‌సీబీ.. డబ్ల్యూపీఎల్ టైటిల్ విన్నర్‌గా స్మృతి మంధాన సేన.. ఫైనల్లో ఢిల్లీ డీలా

వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని చర్చ జరుగుతోంది. ఇరువురి కుటుంబాల్లో వీరి పెళ్లికి ఎలాంటి అభ్యంతరం లేదు. తరచూ వీరి కుటుంబసభ్యులు కలుసుకుంటూ ఉంటారు. పలాష్‌ ఇంటికి, వారి ఇళ్లల్లో జరిగే కార్యక్రమాలకు స్మృతి వెళ్తుంటుంది. పలాష్‌లో సకల కళలు ఉన్నాయి. సినిమా దర్శకత్వం, రచయిత, సంగీత దర్శకుడు, గాయకుడు, నటుడు. ఇలా ఇన్ని పాత్రలు పోషిస్తున్న పలాష్‌ సోషల్‌ మీడియాలో స్మృతి మాదిరి ఫాలోయింగ్‌ పెంచుకుంటున్నాడు. 'డిష్కియావూన్‌', భూత్‌నాథ్‌ రిటర్న్స్‌' సినిమాలకు సంగీతం అందించిన పలాష్‌.. 'ఖేలే హమ్‌ జీ జాన్‌ సే' సినిమాలో నటించాడు. పలాష్‌ ప్రైవేటు సాంగ్స్‌ చేస్తూ ప్రేక్షకుల అభిమానం పొందుతున్నాడు.
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News